గీతాంజలి మృతిపై స్పందించిన సీఎం జగన్
తెనాలికి చెందిన గీతాంజలి మృతి గురించి అందరికి తెలిసిన విషయమే. తాజాగా దీనిపై సీఎం జగన్ స్పందించారు. గీతాంజలి మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం జగన్.. ఈ ఘటన తనని దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. గీతాంజలి కుటుంబాన్ని ఆదుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. గీతాంజలి కుటుంబానికి రూ. 20 లక్షల రూపాయిల పరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
ఏంటి ఈవిడ చనిపోయిందా?
— MBYSJTrends ™ (@MBYSJTrends) March 11, 2024
జగన్ నాకు మంచిచేసాడు అని చెప్పటం ఈమె చేసిన తప్పా
trolls చేసి నిండు ప్రాణాన్ని తీసారు కదరా ఎటు వెళ్తున్నది రా సమాజం
పాపం రా ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు
pic.twitter.com/LuJMMjHIgF
ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు ఇబ్బంది కలిగించే ఏ ఒక్కరిని కూడా రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టదని సీఎం జగన్ స్పష్టం చేశారు. గీతాంజలి ఏపీ ప్రభుత్వం నుంచి తనకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయో ఓ వీడియోలో వివరించింది. గీతాంజలిది పేద కుటుంబం. గతంలో ఆమె కుటుంబం ఒక పూరి గుడిసెలో నివాసం ఉండేది. జగన్ ప్రభుత్వం ఆమెకు ఇంటి పట్టా అందించింది.

ఇంటి పట్టా అందుకున్న తరువాత గీతాంజలి ఆనందానికి అవధులు లేవు. ఈ సందర్భంగా గీతాంజలి మీడియాతో మాట్లాడింది. తన ఇంటి కలను సీఎం జగన్ నిజం చేసిందని హర్షం వ్యక్తం చేసింది. ఈ వీడియోను అధికార వైసీపీ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో గీతాంజలి ఒక్కసారిగా ఫేమస్ అయింది. దీంతో టీడీపీ, జనసేనకు చెందిన కార్యకర్తలు గీతాంజలిని టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ దిగారు.
ఆమె వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ అసభ్యపదజాలంతో గీతాంజలిని దుయ్యపట్టారు. టీడీపీ, జనసేన ట్రోలింగ్ తట్టుకోలేని గీతాంజలి ఆత్మహత్య చేసుకుంది. గీతాంజలి మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ కేసులో టీడీపీ , ఐటీడీపీ, జనసేన పార్టీలకు చెందిన సోషల్ మీడియా అకౌంట్స్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.












Click it and Unblock the Notifications
