5.81 లక్షల మంది ఖాతాల్లో సీఎం జగన్ నిధుల విడుదల..!!
నిరుపేదలైన చిరు వ్యాపారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి జగన్ చెప్పుకొచ్చారు. ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధితో జీవిస్తూ, మరో ఒకరిద్దరికి సైతం ఉపాధి కల్పిస్తున్న చిరు వ్యాపారులు అధిక వడ్డీల బారిన పడకుండా వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు. ఒక్కొక్కరికి ఏటా రూ.10 వేల రుణం సున్నా వడ్డీకే అందిస్తున్నామని, రుణాలను సకాలంలో చెల్లించినవారికి ఏడాదికి మరో రూ.1,000 చొప్పున జోడిస్తూ రూ.13,000 వరకు వడ్డీలేని రుణం అందిస్తున్నామన్నారు.
నిధుల విడుదల : 8వ విడత జగనన్న తోడు కార్యక్రమం నిధులను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేసారు. 3,95,000 మందికి ఒక్కొక్కరికి రూ. 10 వేలు, అంతకుపైన రూ. 417.94 కోట్ల వడ్డీ లేని కొత్త రుణాలు అందిస్తున్నామని చెప్పారు. మొత్తం 16,73,576 మంది లబ్ధిదారుల్లో ఈ విడతలో వడ్డీ రీయింబర్స్‌మెంట్ కింద 5.81 లక్షల మంది లబ్ధిదారులకు రూ.13.64 కోట్లు చెల్లిస్తున్నామన్నారు. చిరువ్యాపారుల బతుకులు నిత్యం మనం చూస్తునే ఉన్నాం. వీరు వ్యాపారాలు చేసుకునేందుకు పడుతున్న కష్టాలు గతంలో ఎవరూ కూడా ఇంత మనసు పెట్టి నిర్ణయాలు తీసుకోలేదని చెప్పుకొచ్చారు. చివరి ఏడు విడతల్లో జగనన్న తోడు కార్యక్రమంతో పాటు 8వ విడతను పరిగణలోకి తీసుకుంటే ఇప్పటి వరకు 16,73,580 చిరువ్యాపారులకు వడ్డీ చెల్లించామని వివరించారు.

అండగా నిలుస్తున్నాం : ఈ స్కీమ్ ద్వారా లబ్ధిపొందిన వివరాలు గమనిస్తే..73,070 మంది చిరువ్యాపారులు ఇప్పటికే నాలుగుసార్లు డబ్బులు తీసుకొని చెల్లించారన్నారు. 5.10 లక్షల మంది మూడుసార్లు డబ్బులు తీసుకొని చెల్లించారని చెప్పారు. మరో 3,98,226 మంది చిరువ్యాపారులు రెండుసార్లు రుణాలు పొందారని వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా చిరువ్యాపారులు, హస్తకళాకారులు, పుట్‌ఫాత్ అమ్మకాలు చేసేవారు, వీధి వ్యాపారులు, రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహించుకునే వారు, ఆటోలు, సైకిళ్లపై అమ్ముకునే వారు..ఇలా వివిధ వృత్తుల కళాకారులు బతకడమే కాకుండా మరి కొంత మందికి ఉపాధి చూపుతున్నారని ముఖ్యమంత్రి చెప్పారు. మొదటి ఏడాది ఎలాంటి గ్యారెంటీ లేకుండా రూ.10 రుణం ఇప్పించడమే కాకుండా ప్రతి ఏటా రూ.1000 పెంచుతూ..దాన్ని రూ.13000లకు పెంచామని సీఎం చెప్పుకొచ్చారు.

దేశానికే దిక్సూచీ : దేశానికే ఈ కార్యక్రమం దిక్సూచిగా నిలిచిందన్నారు. దేశం మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం ఎంతో పుస్ చేసి రుణాలు ఇప్పించే కార్యక్రమంలో భాగంగా కేంద్రంలో 58.63 లక్షల మందికి పీఎం స్వనిధి పేరుతో ఇస్తే..మన రాష్ట్రంలోనే 16.74 లక్షల మంది ఉన్నారని వివరించారు. రూ.10,220 కోట్లు కేంద్రం ఇస్తే..మన రాష్ట్రంలో రూ.3,337 కోట్లు ఇచ్చామని చెప్పారు. మిగతా రాష్ట్రాలు ఎందుకు చేయలేకపోయాయని ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాలు కలిపి కేంద్రం ఇచ్చే 7 శాతం రుణాలు ఇస్తుంటే..మన ఒక్క రాష్ట్రమే 88 కోట్లు వడ్డీ రూపంలో చెల్లించామని ముఖ్యమంత్రి వివరించారు.












Click it and Unblock the Notifications