మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతోంది- సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..!!

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా..మన రాష్ట్రంలోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. అడ్వకేట్లకు అన్నిరకాలుగా మంచి జరగాలనే ఉద్దేశంతో రూ.100 కోట్లతో ఇప్పటికే వెల్ఫేర్‌ ట్రస్టును ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. ఇదే సమయంలో తెలిపారు. ఈ ట్ర‌స్ట్ ద్వారా మెడిక్లెయిం కాని, ఇతరత్రా అవసరాలకు రుణాలు కావొచ్చు... ఈ ఫండ్‌ నుంచి రూ.25 కోట్లు సహాయం చేయడం జరిగింద‌న్నారు. న్యాయవాదులకు రాష్ట్ర ప్రభుత్వం తోడుగా నిలుస్తుందని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 2,677 మంది యువ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ.5 వేల స్టైఫండ్‌ చొప్పున 2023-24 సంవత్సరానికి మొదటివిడత 'వైయ‌స్ఆర్ లా నేస్తం' ఆర్థిక ప్రోత్సాహకాన్ని సీఎం విడుదల చేసారు. వైయ‌స్ఆర్ లా నేస్తం పథకం, ఇలాంటి ఆలోచన దేశంలో ఎక్కడా లేదన్నారు. ఒక మంచి ఆలోచన, ఒక మంచి కార్యక్రమం గా పేర్కొన్నారు.

CM Jagan

ఎవరైనా కూడా లా కోర్స్‌ కంప్లింట్‌ చేసి మొదటి మూడు సంవత్సరాలు ప్రాక్టిస్‌ లేని పరిస్థితిలో వారి కాళ్లపై వారు నిలబడేందుకు వారికి తోడుగా నిలుస్తూ ప్రతి నెల రూ.5 వేల చొప్పున, ఏడాదికి రూ.60 వేలు వారి చేతుల్లో డబ్బు ఉంటే..ఈ మూడేళ్లు ప్రతి ఏటా రూ.60 వేల చొప్పున మూడేళ్లలో రూ.1.80 లక్షలకు వారికి తోడుగా ఉంటే వృత్తిలో ఇబ్బందులు లేకుండా మంచి జీవితంలో నెట్టుకురాగలుగుతారని వివరించారు.

గతేడాది నవంబర్‌లో ప్రారంభించిన ఈ కార్యక్రమం నాలుగేళ్లలో ప్రతి నెల జూనియర్‌ లాయర్లకు రూ.5 వేల చొప్పున అందిస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇంకా అడ్వకేట్లకు మంచి జరగాలనే ఆలోచనతో రూ.100 కోట్లతో అడ్వకేట్‌ జనరల్‌ ఆధ్వర్యంలో వెల్‌ఫేర్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేశామని చెప్పారు.

CM Jagan

ఈ ట్రస్ట్‌ నుంచి న్యాయవాదుల అవసరాలకు అంటే మెడిక్లైమ్స్, ఇతర రుణాలు రకరకాల పద్ధతుల్లో ఉపయోగించుకుంటున్నారని వివరించారు. ఇదంతా కూడా ఈ నాలుగేళ్ల కాలంలో నిజంగా రాష్ట్రం ప్రభుత్వం తోడుగా ఉంది అని చెప్పేందుకు ఈ రెండు కార్యక్రమాలు చెప్పవచ్చన్నారు. ఈ మంచిని ప్రతి పేదవాడికి ట్రాన్స్‌ఫర్‌ అయ్యేలా ప్రతి ఒక్క న్యాయవాది గుర్తు పెట్టుకోవాలని ముఖ్యమంత్రి జగన్ కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+