Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎంపీ పిల్లి బోసు ధిక్కార స్వరం, పార్టీ వీడుతారా - తెర వెనుక ఏం జరిగింది..!!

వైసీపీ ఎంపీ వర్సస్ మంత్రి వివాదం తారా స్థాయికి చేరింది. ఎంపీ బోసు ధిక్కార స్వరం పెంచారు. వేణుకు సీటు ఇస్తే పార్టీ వీడుతానని హెచ్చరించారు. అటు వేణు మరో మూడు విడతలకు తనకే సీటు అని స్వీయప్రకటన చేసారు. ఈ పరిణామాలపై సీఎం ఆగ్రహంగా ఉన్నారు. చికిత్స ప్రారంభించారు. జగన్ కు తొలి నుంచి విధేయుడిగా ఉన్న పిల్లి సుభాస్ చంద్రబోస్ ఈ స్థాయిలో రచ్చ చేయటానికి కారణం ఏంటి. అసలు ఏం జరుగుతోంది.

ఎంపీ బోసు ధిక్కార స్వరం : రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మంత్రి వేణుకు మళ్లీ టికెట్‌ ఇస్తే వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి.. ఆయనపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నానని బోస్‌ సంచలన ప్రకటన చేశారు. సీఎం జగన్‌ ఉన్నంత కాలం ఎమ్మెల్యే పదవి తనదేనని మంత్రి వేణు కూడా స్పష్టం చేశారు. వేణు వేధింపులను ఇటీవల సీఎం జగన్‌తో జరిగిన భేటీలో ఆయన దృష్టికి కూడా తీసుకెళ్లానని చెప్పుకొచ్చారు.

pillisubashchandraboseministerchelluboina21

వేణు, తాను కలిసి కూర్చొని పెద్దల సమక్షంలో మాట్లాడాలని చేస్తున్న సూచనలకు ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించనని సీఎం ముందే చెప్పానని బోస్ వెల్లడించారు. అదే సమయంలో సీఎం జగన్ పైన విశ్వాసం ప్రకటించారు. సీఎం జగన్‌ అన్నా, అతడి తండ్రి అన్నా తనకు అపార గౌరవం ఉందని చెప్పుకొచ్చారు. తాను జగన్ వెంట నిబద్దత కలిగిన కార్యకర్తగా నిలిచానన్నారు.

బోసుకు సీఎం జగన్ ప్రాధాన్యత : మంత్రి వేణుకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే తాను స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తానని సంచలన ప్రకటన చేసారు. దీంతో పిల్లి బోసు ఎందుకు ఇంతలా ధిక్కరిస్తున్నారనే చర్చ మొదలైంది. బోసుకు సీఎం జగన్ అన్ని సమయాల్లోనూ ప్రాధాన్యత ఇచ్చారు. 2019లో మండపేటలో ఆయన ఓడినా ఉప ముఖ్యమంత్రిని చేసి ఎమ్మెల్సీ ఇచ్చారు.

శాసనమండలి రద్దవుతుందనుకుంటున్న సమయంలో సీఎం జగన్‌.. బోస్‌ను పిలిచి.. మండలి రద్దయ్యే అవకాశం ఉందని.. రాజ్యసభకు వెళ్తారా అని అడిగితే ఆయన అంగీకరించారు. మండలి రద్దు అవదని తేలాక.. మళ్లీ జగనే పిలిచి మంత్రిగా కొనసాగుతారా లేదా రాజ్యసభకు వెళ్తారా అని అడుగగా.. రాజ్యసభకు వెళ్తానని బోస్‌ చెప్పారు. ఇప్పుడు మంత్రి వేణుతో వచ్చిన విభేదాలు..తన కుమారుడు సీటు కోసం బోసు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఇది సీఎం జగన్ ఆగ్రహానికి కారణమైంది.

pillisubashchandraboseministerchelluboina21

15 ఏళ్లు తనకే సీటు అంటున్న మంత్రి వేణు : ఈ సమయంలో మంత్రి వేణు కూడా కీలక వ్యాఖ్యలు చేసారు.2019లో బోస్‌ పోటీ చేయనని చెబితేనే.. జగన్‌ ఆదేశం తో తాను రామచంద్రపురం వచ్చానన్నారు. కాకినాడ రూరల్‌ వంటి నియోజకవర్గం వదులుకుని రామచంద్రపురం రావాల ని ఎవరైనా అనుకుంటారా అని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కొందరు నేతలు స్వార్థంతో సంపాదనే ధ్యేయంగా ఉంటే వారిని దూరం పెట్టానని, ఇది తప్పెలా అవుతుందన్నారు.

అప్పట్లో తోట త్రిమూర్తులును పార్టీలో చేర్చుకునే సందర్భంలో సీఎం జగన్‌, ఎంపీ బోస్‌ సమక్షంలో.. 2024లో, ఆపై వచ్చే ఎన్నికల్లో 10 ఏళ్లపాటు తానే రామచంద్రపురంలో పోటీ చేయాలని కోరారని.. అందుకు త్రిమూర్తులు అంగీకరించారని, ఏమాత్రం కలుగచేసుకోరని జగన్‌ హామీ ఇచ్చారని తెలిపారు. దీంతో, బోసు తాజా అల్టిమేటంతో ఇప్పుడు సీఎం జగన్ నిర్ణయం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+