ఎమ్యెల్యేలకు జగన్ షాక్..తప్పుకోవాలంటూ ఆదేశాలు

ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎన్నికలకు మరో నాలుగు నెలలు మాత్రమే సమయం ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు గెలుపుపై ఫోకస్ పెట్టాయి. ముఖ్యంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించింది. గెలిచే అభ్యర్థులకే టికెట్లు కేటాయిస్తానని పార్టీ అధినేత జగన్ గత రెండేళ్లుగా చెబుతూ వస్తున్నారు. తాజాగా ఆయన ఆ మాటలను నిజం చేస్తూ.. గెలిచే అభ్యర్థులకే టికెట్లను కేటాయించారు.

దీనిలో భాగంగానే 11 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చి సంచలనం సృష్టించారు. వీరిలో తనకు దగ్గరైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డికి సైతం జగన్ టికెట్ కేటాయించలేదు. మంత్రి విడుదల రజినికి సైతం స్థానచలనం తప్పలేదు. చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్చి విడుదల రజినికి గట్టి షాకే ఇచ్చారు. కొందరి ఎమ్మెల్యేల పనితీరుపై వ్యతిరేకత రావడంతో.. వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వూలు జారీ చేయడం జరిగింది.

CM Jagan suggestion to MLAs and ministers

మరికొంతమంది ఎమ్మెల్యేలను మార్చే యోచనలో సీఎం జగన్ ఉన్నట్టు అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 40 స్థానాలకు పైగానే అభ్యర్థులను మారుస్తారనే ప్రచారం జరుగుతుంది. సర్వేల్లో వెనకపడిన ఎమ్మెల్యేలను పక్కన పెట్టాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. వారి స్థానంలో బలమైన అభ్యర్థులను పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నారు. సర్వేలో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను పిలిపించుకుని వారితో సీఎం జగన్ ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు.

ఈసారి టికెట్ ఇవ్వలేనని.. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఎమ్మెల్సీ పదవి, రాజ్యసభ పదవులు ఇస్తానని పలువురికి జగన్ హామీ ఇస్తున్నారు. వయస్సులో తన కంటే పెద్దవారిని ...అన్నా మీకు టికెట్ ఇవ్వలేను. దయచేసి గౌరవంగా తప్పుకోండని ఎమ్మెల్యేలను , మంత్రులను సీఎం జగన్ కోరుతున్నారు. నేను తప్పించాననే మాట రానివొద్దు .. వ్యక్తిగత కారణాలతో మీరే పోటీకి దూరంగా ఉంటున్నామని ప్రకటించి తప్పుకుంటే ప్రజల్లో మీకు గౌరవం ఉంటుందని పలువురు సీనియర్ నేతలకు సీఎం జగన్ సూచించారని తెలుస్తుంది.

CM Jagan suggestion to MLAs and ministers

జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై కొందరు ఎమ్మెల్యేలు అంగీకారం తెలిపగా.. మరికొందరు కినుకు వహించారు. ఈ సమయంలో వేరే పార్టీకి వెళ్లిన పెద్దగా ఒరిగేదేమీ లేకపోవడంతో టికెట్ దక్కని ఎమ్మెల్యేలు మౌనంగా ఉంటున్నారు. మొత్తానికి సీఎం జగన్ పార్టీ నేతలకు టికెట్ల విషయంలో ఓ స్పష్టత ఇచ్చినట్టే కనిపిస్తుంది. ఇక అధికారికంగా ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనే మిగిలుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+