లోబర్చుకోవటం..పెళ్లిళ్లు చేసుకోవటం - పవన్, బాలయ్య, లోకేశ్ కు జగన్ స్ట్రాంగ్ కౌంటర్..!!
ముఖ్యమంత్రి జగన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. వాలంటీర్ల వ్యవస్థ పైన పవన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. మంచి చేస్తున్న వ్యవస్థ గురించి సంస్కారం కోల్పోయిన వాళ్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. వాలంటీర్ల గురించి చంద్రబాబు వాలంటీర్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేసారు. వాలంటీర్లు మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారంటూ వారి క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్న వారికి క్యారెక్టర్ ఏంటని ప్రశ్నించారు. బాలయ్య ..లోకేశ్ పైన కీలక వ్యాఖ్యలు చేసారు.
సీఎం సంచలన వ్యాఖ్యలు : వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్సార్ నేతన్న నేస్తం నిధులను విడుదల చేసారు. బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్, బాలయ్య ను సీఎం టార్గెట్ చేసారు. పవన్ కల్యాణ్ పదే పదే వాలంటీర్ల వ్యవస్థ పైన చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. అవినీతి..వివక్షకు తావు లేకుండా వాలంటీర్లు ప్రభుత్వ సేవలను ప్రజల ముందుకు తీసుకెళ్తున్నారని వివరించారు.

వాలంటీర్లు అంతా తెలిసిన వాళ్లేనని.. మన ముందు ఉండే వాళ్లేనని చెప్పుకొచ్చారు. పార్టీలు..మతాలు...వర్గాలు లేకుండా సేవలు అందిస్తున్నారని సీఎం చెప్పారు. వాలంటీర్ల క్యారెక్టర్ ను తప్పు బడుతూ మాట్లాడుతున్నారని..వాటి నిర్మాత చంద్రబాబు అయితే, నటన - డైలాగ్స్ దత్తపుత్రుడివని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు.
వాలంటీర్లను అవమానిస్తారా : రాష్ట్రంలో సేవలందిస్తున్న 2.60 లక్షల మంది వాలంటీర్లు చదువుకున్న సంస్కార వంతులని చెప్పకొచ్చారు. వాలంటీర్లను తప్పుబడుతోంది చంద్రబాబు కు వాలంటీర్ గా పని చేస్తున్న ప్యాకేజీ స్టార్ అని సీఎం ఎద్దేవా చేసారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, సొంత పుత్రుడు, చంద్రబాబు బామ్మర్ది క్యారెక్టర్ ఎలాంటిదో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు.
అమ్మాయిలను లోబరుచుకొని పెళ్లి చేసుకోవటం..నాలుగేళ్లు కాపురం చేయటం...వదిలేయటం..మళ్లీ మళ్లీ పెళ్లి చేసుకోవటం..ఒకరితో వివాహ బంధంలో ఉంటూ మరొకరితో అక్రమ సంబంధం నడిపే వారు మన వాలంటీర్ల గురించి మాట్లాడుతారని ముఖ్యమంత్రి ఫైర్ అయ్యారు. మరొకరు పట్టపగలే మందు తాగుతూ పది మంది అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్ లో డాన్స్ చేసిన వీడియోలు యూ ట్యూబ్ లో ఉన్నాయని సీఎం జగన్ చెప్పుకొచ్చారు.

వీరి క్యారెక్టర్ గుర్తించండి : ఇంకొకరు అమ్మాయి కనిపిస్తే ముద్దైన పెట్టాలి..కడుపైనా చేయాలనే దౌర్బాగ్యుడని ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేసారు. మరొకరి వయసు 75 ఏళ్లు. టీవీల్లోకి వచ్చి ఆహా బావ నీవు సినిమాల్లో చేసావు. నేను నిజ జీవితంలో చేసానని చెప్పుకొనే ముసలాయన అంటూ సీరియస్ కామెంట్స్ చేసారు. క్యారెక్టర్ లేని వీళ్లంతా మంచి చేస్తున్న మన వాలంటీర్ల గురించి ప్రచారం చేస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు.
వీళ్ల పర్స నల్..పబ్లిక్ లైఫ్ లోనూ అన్నీ కుట్ర బుద్దులు..కుతంత్రాలని సీఎం వ్యాఖ్యానించారు. బీజేపీతో పొత్తు. చంద్రబాబుతో కాపురం అని చెప్పుకొచ్చారు. ఇచ్చేది తన పార్టీ బీ ఫాం...టీడీపీకి బీ టీం అని ఎద్దేవా చేసారు.చంద్రబాబు పై పోటీ డ్రామా...బీజేపీతో స్నేహం డ్రామా..ప్రత్యేక పార్టీ అనేది ఇంకో డ్రామా అంటూ సీఎం ఫైర్ అయ్యారు.

మంచి జరిగితే అండగా నిలవండి : ఎవరి క్యారెక్టర్ ఏంటో గుర్తించాలని సీఎం జగన్ సూచించారు. ప్రతీ ఇంటికి మంచి జరిగిందా లేదా అనేదే చూడాలని సూచించారు. రూ 2.25 లక్షల కోట్లు పేదల ఖాతాల్లో జమ చేశామని చెప్పుకొచ్చారు. మంచి చేస్తున్న చరిత్ర ఈ ప్రభుత్వానిదేనని వివరించారు. రానున్న రోజుల్లో ఇదే తరహాలో అబద్దాలు...కుట్రలతో ప్రచారం చేస్తారని హెచ్చరించారు. వీటిని నమ్మవద్దని కోరారు. ప్రజలకు మంచి చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని హామీ ఇచ్చారు. మంచి జరిగిందని నమ్మితే అండగా నిలవాలని ముఖ్యమంత్రి జగన్ మరోసారి కోరారు.












Click it and Unblock the Notifications