జగన్ కు బ్రహ్మాస్త్రం అందించిన కూటమి - సెల్ఫ్ గోల్..!!

ఏపీ ఎన్నికల్లో అసలైన యుద్దం మొదలైంది. కూటమి, వైసీపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు సాగుతోంది. పోలింగ్ కు సమయం సమీపిస్తుండటంతో పార్టీలు వ్యూహాలు వేగంగా అమలు చేస్తున్నాయి. గెలుపు పైన ప్రధాన పార్టీలు ధీమాతో ఉన్నాయి. ఇదే సమయంలో పోలింగ్ వేళ డీబీటీ పథకాల అమలు పైన సస్పెన్స్ కొనసాగుతోంది. హైకోర్టు అనుమతించినా..ఎన్నికల సంఘం నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉంది. తాజా పరిణామాలు వైసీపీకి అనుకూలంగా మారుతున్నాయి.

కొత్త వివాదం
ఏపీలో మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనుంది. ప్రభుత్వం ఈ సమయంలో గత అయిదేళ్ల కాలంగా అమలు చేసిన పథకాల పెండింగ్ నిధుల విడుదలకు ఈసీ అనుమతి కోరింది. కోడ్ వస్తుందనే కారణంతో మార్చ్ లోనే అధికారికంగా ఈ నిధులు విడుదల చేసారు. లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయటానికి తమకు అందిన ఫిర్యాదులతో ఎన్నికల సంఘం బ్రేకు వేసింది. దీని పైన లబ్దిదారులు కోర్టును ఆశ్రయించారు. పోలింగ్ ముగిసిన తరువాత నిధులు విడుదల చేయాలని ఎన్నికల సంఘం పేర్కొంది. వాదనలు పూర్తయిన తరువాత కోర్టు నిధుల విడుదలకు ఒక్క రోజు సమయం ఇచ్చింది. కోర్టు ఉత్తర్వులతో ఏపీ ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని సంప్రదించింది.

CM Jagan targets TDP Alliance over complaint to EC on DBT Schemes implementation

కూటమి ఫిర్యాదులతో
నిధుల విడుదలకు తాము సిద్దంగా ఉన్నామని వెల్లడించింది. కానీ, ఎన్నికల సంఘం నుంచి తుది ఆమోదం కోసం ప్రభుత్వం వేచి చూస్తోంది. దీని పైన జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. గతంలో పెన్షన్ల విషయంలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసిన టీడీపీ..వారికి కష్టాలకు కారణమైందని ఆరోపించారు. వాలంటీర్ల ద్వారా 58 నెలలుగా అందిస్తున్న పెన్షన్లు ఇవ్వకపోవటానికి చంద్రబాబు కారణమని ఆరోపించారు. పెన్షన్ల లబ్దిదారుల్లోనూ అదే విషయం బాగా వెళ్లింది. ఏప్రిల్, మే నెలల్లో ఇదే తరహాలో పెన్షన్ దారులు ఇబ్బంది పడ్డారు. ఇక...ఇప్పుడు పథకాల పంపిణీ విషయంలోనూ ఎన్నికల సంఘానికి అందిన ఫిర్యాదులే కారణంగా చెబుతున్నారు. చంద్రబాబు లబ్దిదారుల గొంతు పిసికేస్తున్నారని జగన్ ఆరోపించారు.

CM Jagan targets TDP Alliance over complaint to EC on DBT Schemes implementation

జగన్ క్లారిటీ
లబ్దిదారులకు నగదు అందించేందుకు తాము కోర్టుకు వెళ్లామని వెళ్లడించారు. జగన్ అయిదేళ్ల కాలంగా అందిస్తున్న పథకాలకు చంద్రబాబు అడ్డు పడుతున్నారని వైసీపీ నేతలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. పెన్షన్లు రూ 4 వేలు చేస్తామని చెప్పినా..చంద్రబాబు కు మొగ్గు కనిపించటం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. అదే తరహాలో ఇప్పుడు పథకాల లబ్దిదారులకు అందాల్సిన నగదు అందకుండా చేసింది చంద్రబాబు అని ప్రచారం సాగుతోంది. ఇది ఎన్నికల సమయంలో తమకు నష్టం చేస్తుందని కూటమి నేతలు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల సంఘం అనుమతి రాకపోతే..పోలింగ్ పూర్తయిన వెంటనే ఖాతాల్లో నగదు జమ చేసే బాధ్యత తనదేనని జగన్ చెప్పే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+