Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎం జగన్ ఎన్నికల వరాలు "సిద్దం" - రైతులు, మహిళలకు పండుగే..!!

సీఎం జగన్ ఎన్నికల వరాల ప్రకటనకు సిద్దమయ్యారు. ఇప్పటికే సిద్దం సభల ద్వారా ఎన్నికల సమరశంఖం పూరించారు. మరో రెండు జాబితాలతో అభ్యర్దుల ఎంపిక ప్రకియ పూర్తి చేయనున్నారు. అటు ప్రతిపక్షాలు పొత్తులతో వస్తున్న వేళ తన సంక్షేమం - సామాజిక న్యాయం తనకు అధికారం నిలబెడతామనే నమ్మకంతో ఉన్నారు. అధికారంలోకి వస్తే అమలు చేసే హామీల ప్రకటన పైన జగన్ తుది కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 18న సిద్దం సభలో ప్రకటించాలని నిర్ణయించారు.

జగన్ వ్యూహాలు
ముఖ్యమంత్రి జగన్ ఈ సారి ఎన్నికలకు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. ప్రతిపక్షాలు పొత్తులతో వస్తున్న వేళ ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేసామని వైసీపీ నేతలు చెబుతున్నారు. నాడు ఇచ్చిన హామీలు దాదాపుగా అన్నింటా మహిళా లబ్దిదారులే ఉన్నారు.

CM Jagan to announce Election promises fone next Elections in siddham meeting on 18th at Raptadu

నాడు పెన్షన్ రూ 2 వేల నుంచి దశల వారీగా రూ 3వేలకు పెంచుతానని జగన్ హామీ ఇచ్చారు. అదే విధంగా కిందటి నెల జనవరి నుంచి రూ 3వేల చొప్పున వైఎస్సార్ పెన్షన్ కానుక అమలు చేస్తున్నారు. అదే విధంగా మహిళలకు, రైతులకు చెప్పిన విధంగా పథకాలు..రైతు భరోసా అమలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించినా..బకాయిలు కొంత మేర చెల్లించాల్సి ఉంది. వీటి చెల్లింపు పైన తాజాగా ప్రభుత్వం హామీ ఇచ్చింది.

మేనిఫెస్టో సిద్దం
ఇప్పటికే టీడీపీ గత మహానాడు సమయంలో సూపర్ సిక్స్ పేరుతో సంక్షేమ మేనిఫెస్టో ప్రకటించింది. దీనిని ఇప్పుడు ప్రతీ ఇంటి బలంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలే గెలిపిస్తాయనే ధీమాతో ఉండటంతో..తాము సంక్షేమంతో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయింది. ఇక, అమలు చేసే హామీలే ఇస్తాము..హామీ ఇస్తే అమలు చేస్తామనే విధంగా జగన్ వచ్చే ఎన్నికల మేనిఫెస్టో ప్రకటనకు సిద్దమయ్యారు.

ఈ నెల 18న అనంతపురం జిల్లాలో జరిగే సిద్దం సభలో తన ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. అందులో రైతు రుణమాఫీ ప్రకటన చేస్తారని పెద్ద ఎత్తున పార్టీలో ప్రచారం సాగుతోంది. ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా హామీల ప్రకటనలు ఉంటాయని చెబుతున్నారు. 2014 ఎన్నికల సమయంలో రైతు రుణమాఫీ పైన ప్రకటన చేయమని పలువురు కోరినా..నాడు సాధ్యం కాని హామీ ఇవ్వనని తానే ప్రకటన చేయని విషయాన్ని తాజాగా అసెంబ్లీలో జగన్ గుర్తు చేసారు.

ఎన్నికల వరాలు
ఇప్పుడు జగన్ రుణమాఫీ నిర్దేశిత మొత్తం వరకు చేస్తానని హామీ ఇవ్వటం ఖాయమని భావిస్తున్నారు. సామాజిక పెన్షన్ రూ 3 వేల నుంచి రూ 4వ వేలకు పెంచుతారనే అంచనాలు ఉన్నాయి. అదే విధంగా మహిళా ఓట్ బ్యాంక్ ను ప్రధానంగా నమ్ముకున్న జగన్ మధ్య, దిగువ తరగతి మహిళలకు ఆర్దికంగా తోడ్పాటు అందించటంతో పాటుగా వారి స్వశక్తి మీద ఎదిగేలా కొత్త ప్రణాళికలను ప్రకటించేందుకు సిద్దం అయ్యారని తెలుస్తోంది.

2019 లో ప్రకటించిన పథకాలను కొనసాగిస్తూనే..వారికి ప్రభుత్వం నుంచి తోడ్పాటు అందేలా కీలక పథకం ప్రతిపాదన చేయనున్నట్లు సమాచారం. ఉద్యోగ సంఘాలతోనూ త్వరలో ప్రభుత్వం చర్చలు చేయనుంది. వారికి ఐఆర్ ప్రకటన దిశగా నిర్ణయం ఉంటుందని సమాచారం. దీంతో.. అనంతపురం సభా వేదికగా జగన్ ప్రకటించే ఎన్నికల వరాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+