Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజ్యసభకు మరో ముగ్గురు వైసీపీ సభ్యులు - సీఎం జగన్ ఛాయిస్ వీరే..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. సీఎం జగన్ గెలుపే ప్రామాణికంగా ఇంఛార్జ్ లను మారుస్తున్నారు. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎమ్మెల్యేగా అవకాశం దక్కని వారికి ఎమ్మెల్యే, రాజ్యసభ, ప్రభుత్వంలో పదవుల పైన హామీలు ఇస్తున్నారు. ఈ సమయంలోనే మార్చిలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీకి మూడు సీట్లు దక్కనున్నాయి. ఈ రెండు సీట్ల నుంచి జగన్ ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

రాజ్యసభ ఎన్నికలు : వచ్చే ఏప్రిల్ లో 55 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. ఏపీకి చెందిన బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన పదవీ కాలం ఏప్రిల్ తో ముగియనుంది. తెలంగాణలో మూడు సీట్లు ఖాళీ అవుతాయి. అందులో రెండు కాంగ్రెస్ కు, ఒకటి బీఆర్ఎస్ కు దక్కే అవకాశం ఉంది. ఇటు ఏపీలో మగ్గురు సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. అందులో వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నుంచి కనకమేడల రవీంద్ర బాబు, బీజేపీ నుంచి సభ్యుడిగా ఉన్న సీఎం రమేష్ పదవీ కాలం ముగియనుంది. ఈ ముగ్గురు 2024, ఏప్రిల్ 2 న పదవీ విరమణ చేయనున్నారు. ఈ స్థానాల భర్తీ కోసం మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి.

CM Jagan to clear the names of candidates for the two Rajya Sabha seats, the Aspirants list is here

వైసీపీ నుంచి ముగ్గురు : వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో, ఇప్పటికే నెల్లూరు జిల్లాకు చెందిన విజయ సాయిరెడ్డి, బీదా మస్తాన రావు వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. దీంతో నెల్లూరు నుంచి మరొకరికి అవకాశం దక్కే ఛాన్స్ లేదు. తాజాగా అసెంబ్లీ సీట్ల ఖరారు..మార్పులు - చేర్పులు, పార్టీ బాధ్యతల ఖరారు వేళ సీఎం జగన్ ఎవరిని రాజ్యసభకు పంపాలనేది దాదాపు నిర్ణయం తీసుకున్నారు. అందులొ వేమిరెడ్డి స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన వైవీ సుబ్బారెడ్డిని ఎంపిక చేయటం ఖాయంగా కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లోనూ వైవీకి సీటు దక్కలేదు. ప్రస్తుతం వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సుబ్బారెడ్డికి హామీ దక్కినట్లు తెలుస్తోంది.

CM Jagan to clear the names of candidates for the two Rajya Sabha seats, the Aspirants list is here

ఈ ముగ్గురికీ అవకాశం : ఇక, సీఎం రమేష్..కనకమేడల స్థానంలో వైసీపీ మరో ఇద్దరు అభ్యర్దులను ఖరారు చేయాల్సి ఉంది. వీటిలో ఒక స్థానం మైనార్టీ వర్గానికి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సినీ నటుడు ఆలీకి ఈ సారి సీటు ఖాయమని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మూడో స్థానం ప్రస్తుత పోలవరం ఎమ్మెల్యే బాలరాజుకు కేటాయిస్తారని సమాచారం. రానున్న ఎన్నికల్లో బాలరాజుకు ఎమ్మెల్యే సీటు ఇవ్వటం లేదని సమాచారం. ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలనేది సీఎం ఆలోచనగా తెలుస్తోంది. ఎన్నికల వేళ సామాజిక సమీకరణాల ఆధారంగానే రాజ్యసభ అభ్యర్దులను ఖరారు చేయనున్నారు. ఈ మూడు స్థానాలకు అభ్యర్దుల ఎంపికతో రాజ్యసభలో వైసీపీ సంఖ్యా బలం 11కి చేరనుంది. మొత్తం ఏపీ నుంచి ప్రాతినిధ్యం అందరూ వైసీపీ సభ్యులే ఉండనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+