పథకాల లబ్ది దారులు, సేవలకు సీఎం జగన్ మరో ఛాన్స్ - డోన్ట్ మిస్..!!

ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 87 శాతం ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్న వేళ..మరో అడుగు ముందుకేస్తున్నారు. అర్హత ఉన్న ఏ ఒక్కరూ లబ్ది అందకుండి మిగలకుండా ఉండాలనే లక్ష్యంతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.అదే విధంగా ప్రతీ ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో నిర్వహిస్తున్న జగనన్న సంక్షేమం ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. నెల రోజుల పాటు దీనిని నిర్వహించనున్నారు.

లబ్దిదారులకు మరో ఛాన్స్
రాష్ట్ర వ్యాపప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాయాల్లో నెల రోజుల పాటు జగనన్న సురక్ష నేటి నుంచి ప్రారంభం కానుంది. ప్రభుత్వ పథకాల్లో ఎవరైనా అర్హత ఉండి లబ్ది పొందని వారు ఉంటే వారిని గుర్తించి వారికి అవకాశం కల్పించటం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. దీని కోసం వాలంటీర్లు..అధికారులు..పార్టీ నేతలు ప్రతీ ఇంటికి వెళ్లనున్నారు.

CM Jagan

ప్రతీ ఇంటిలోనూ అర్హత ఉండి పథకాలు అందని వారు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో జల్లెడ పట్టనున్నారు. వారికి లబ్ది చేకూర్చటంతో పాటుగా వారికి అవసరమైన సర్టిఫికెట్లు ఏమైనా అవసరమైతే 11 రకాల సేవలను ఎటువంటి ఫీజు లేకుండా అందించేలా ఈ కార్యక్రమం కొనసాగనుంది. గుర్తించిన అర్హులకు ఆగస్టు నుంచి పథకాలు అందనున్నాయి.

ఆగస్టు నుంచి పథకాలు
ఇప్పటికే అర్బన్ ప్రాంతంలో 84 శాతం...గ్రామీణ ప్రాంతంలో 92 శాతం మందికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. సగటున రాష్ట్ర వ్యాప్తంగా 87 శాతం మంది లబ్దిదారులుగా ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇంకా ఎవరైనా పథకాల లబ్దిదారులు ఉంటే వారికీ అవకాశం కల్పించాలని సీఎం జగన్ నిర్ణయించారు. వారి నుంచి అవసరమైన పత్రాలు సేకరిస్తారు.

వారికి కావాల్సిన కుల, ఆదాయ, జనన వంటి సర్టిఫికెట్లను తీసుకొని అక్కేడ దరఖాస్తులను పూర్తి చేస్తారు. సేకరించిన దరఖాస్తును సచివాలయాల్లో సమర్పించి వాటి సర్వీసు రిక్వెస్టు నెంబరు తిరిగి తీసుకెళ్లి ఇంటి వద్దే అందిస్తారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు వారికి తోడుగా ఉండేలా విధి విధానాలు ఖరారు చేసారు.

cm jagan

ప్రత్యేక క్యాంపులతో సేవలు
దీంతో పాటుగా జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా జూలై 1 నుంచి అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రత్యేక క్యాంపుల్లో ప్రధానంగా 11 రకాల సేవలు, ధ్రువీకరణ పత్రాల జారీకి ఎలాంటి సర్విసు చార్జీలు వసూలు చేయకూడదని నిర్ణయం తీసుకుంది.

నాలుగు వారాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. వలంటీర్లతో పాటు సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఈ కార్యక్రమం గురించి వివరిస్తారు. అంతేకాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వివిధ రకాల వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాల జారీకి వినతులను కూడా సేకరిస్తారు. క్యాంపుల నిర్వహణ సమయంలో వినతుల స్వీకరణ, పరిష్కారం కోసం రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్, సర్విసు రిక్వెస్టు డెస్క్‌లు వేర్వేరుగా ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+