సీఎం జగన్ చేతిలో ఐ ప్యాక్ చిట్టా : టికెట్లు దక్కేదెవరికి - హిట్ లిస్టులో ఉన్నదెవరు..!?

పార్టీ నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి టికెట్ల కేటాయింపుపైన క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల దిశగా వేగం పెంచారు. కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ఎమ్మెల్యేల పని తీరు పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ప్రజలతో మమేకం అయ్యేలా ఎమ్మెల్యేలను గడప గడపకు ప్రభుత్వం నిర్వహిస్తున్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికలకు వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి ప్రతీ నియోజకవర్గాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు. నియోజకవర్గాల్లోని క్షేత్ర స్థాయి పరిస్థితులు..ఎమ్మెల్యేల పని తీరు ప్రాతిపదికగా సర్వే నివేదికలు అందుతున్నాయి. గెలిచే వారికే టికెట్లు అని ఇప్పటికే స్పష్టం చేసారు. పనితీరు మెరుగు పర్చుకోవాల్సిన వారికి హెచ్చరికలు చేసారు. ఈ రోజు పార్టీ ఎమ్మెల్యేలతో జగన్ సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేల పనితీరు కు సంబంధించి ప్రోగ్రస్ రిపోర్టులను వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.

పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం..

పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం..

పార్టీ నేతలతో ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు కీలక సమావేశం ఏర్పాటు చేసారు. ప్రాంతీయ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలతో సీఎం జగన్‌ సమావేశం కానున్నారు. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమ సమీక్షతో పాటుగా గృహ సారథులు..సమన్వయకర్తల సేవల వినియోగం పైన ప్రధానంగా మార్గ నిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే గృహ సారథులు...కో ఆర్డినేటర్ల నియామక సమయం ముగిసింది. నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యాలయాలయు ఆ జాబితాలు చేరాయి. పెండింగ్ ఉన్న నియోజకవర్గాల్లో వెంటనే పూర్తి చేయాలని పార్టీ ఆదేశించింది. ఈ నెల 14వ తేదీ నుంచి 18 వరకు వీరికి శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఇది పూర్తయిన తరువాత ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా జగనన్నే మన భవిష్యత్తు కార్యక్రమం ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సమయంలో దీనిని నిర్వహించేందుకు పార్టీ నిర్ణయించింది. ఈ మొత్తం షెడ్యూల్ కు సంబంధించి నేటి సమావేశంలో ఎమ్మెల్యేలకు క్లారిటీ ఇవ్వనున్నారు.

ఎమ్మెల్యేల ప్రోగ్రస్ కార్డులు సిద్దం

ఎమ్మెల్యేల ప్రోగ్రస్ కార్డులు సిద్దం

ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి వారి ప్రోగ్రస్ కార్డులు ఎప్పటికప్పుడు పార్టీ నాయకత్వం సిద్దం చేస్తోంది. ప్రతీ ఇంటికి ఎమ్మెల్యే వెళ్లి..వారితో కొద్ది సేపు మమేకం కావాలని సీఎం జగన్ ఇప్పటికే పలుమార్తు నిర్దేశం చేసారు. డిసెంబర్ లో జరిగి సమావేశంలో 32 మంది ఎమ్మెల్యేలు ఆశించిన స్థాయి కంటే వెనుకబడి ఉన్నట్లుగా గుర్తించారు. వారికి ఈ నెల వరకు సమయం నిర్దేశించారు. ఎమ్మెల్యేలు తమ గ్రాఫ్ పెంచుకోకుంటే ప్రత్యామ్నాయం తప్పదని హెచ్చరించారు. వారి సేవలను పార్టీ మరో విధంగా వినియోగించుకుంటుందనే సంకేతాలు ఇచ్చారు. తాను ఏ ఒక్క ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వకుండా ఉండాలని అనుకోవటం లేదని..కానీ, ఈ సారి గెలిస్తే మరో 25 ఏళ్లు పార్టీకి ఎదురే లేదని జగన్ పదే పదే ప్రస్తావిస్తున్నారు. ప్రతీ నియోజకవర్గంలో గెలుపు దక్కాల్సిందేనని..గెలుపే ప్రామాణికంగా టికెట్ కేటాయింపు ఉంటుందని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. నేటి సమాశంలో ఎమ్మెల్యే పనితీరు..టికెట్లకు సంబంధించి క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఐ ప్యాక్ నివేదికలు.. సీఎం మార్గదర్శకం

ఐ ప్యాక్ నివేదికలు.. సీఎం మార్గదర్శకం

సీఎం జగన్ ప్రతీ నియోజకవర్గంలో పార్టీ పరిస్ధితులు..ఎమ్మెల్యేల పని తీరు పైన పూర్తి స్థాయిలో సర్వే నివేదికలతో సిద్దమయ్యారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే టికెట్లు ఖరారు చేస్తానని ప్రకటించారు. టీడీపీ - జనసేన పొత్తు వేళ టికెట్ల కేటాయింపు అంశంలో సీఎం జగన్ ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. అయితే...సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో వారి పని తీరు మాత్రమే టికెట్ ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయిస్తుందని స్పష్టం చేసారు. ఇప్పుడు తాజాగా సర్వే నివేదికల్లో ఆ 32 మంది ఎమ్మెల్యేల కు సంబంధించి ఎం తేల్చారనేది కీలకంగా మారుతోంది. వారిలో తాజా-మాజీ మంత్రులతో పాటుగా సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని సమాచారం. ఇక..పార్టీలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలను సీఎం ప్రస్తావించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఎటువంటి ప్రకటనలు చేయబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది. పార్టీ నేతలంతా ఇక ప్రజల్లోనే ఉండాలని నిర్దేశించనున్న ముఖ్యమంత్రి..కీలక ప్రకటనలకు సిద్దం అవుతున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+