పథకాల లబ్దిదారులకు జగన్ గుడ్ న్యూస్ - మరోఛాన్స్, నిధుల జమ..!!
ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తన ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం - సామాజిక న్యాయం తనకు మరోసారి అధికారం అప్పగిస్తుందనే నమ్మకంతో జగన్ ఉన్నారు. రాకీయంగా ఇంఛార్జ్ ల మార్పు విషయంలో సంచలన నిర్ణయాలు అమలు చేస్తున్నారు. ఇదే సమయంలో అర్హత ఉండీ సంక్షేమ పథకాలు అందని వారికి అవకాశం కల్పిస్తున్నారు. కొత్తగా చేరిన వారికి పథకాల అమలు దిశగా నిధులు విడుదల చేస్తున్నారు.
పథకాలు అమలు: ముఖ్యమంత్రి జగన్ అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి పథకాలు అందిస్తామని చెబుతున్నారు. అర్హత ఉండీ ఏ కారణంతో అయినా పథకాలు అందని వారికి మరో అవకాశం కల్పిస్తున్నారు. వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

తాజాగా 68,990 మంది అర్హులకు రూ.97.76 కోట్లను బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమచేయనున్నారు. ఇలా ఏటా రెండు పర్యాయాలు.. జనవరి-జూన్ మధ్య అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణంతోనైనా మిగిలిపోయిన వారికి జూన్, జూలైలోను.. అలాగే, జూలై నుంచి డిసెంబర్ వరకు మిగిలిపోయిన వారికి డిసెంబర్, జనవరిలో సాయం అందిస్తున్నారు.
మార్గదర్శకాలు జారీ: అర్హత ఉండీ పథకాలు అమలు కాని వారికి కొత్తగా దరఖాస్తులకు అవకాశం ఇస్తున్నారు. వారికి మార్గదర్శకాలు జారీ చేసారు. అర్హత ఉండి ఆయా పథకాల లబ్ధి పొందని వారు వాటిని అందించిన నెలలోపు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైతే వలంటీర్ సేవలు వాడుకోవచ్చు లేదా 1902కి ఫోన్‌చేస్తే వారు తగు సూచనలు ఇస్తారు.
సచివాలయాల్లో అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేశాక వెరిఫికేషన్ చేస్తారు. ఆ తర్వాత ఆరు నెలలకోసారి సంక్షేమ పథకాల లబ్ధి అందిస్తారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకతతో వ్యవహరిస్తన్నారు. సోషల్ ఆడిట్ కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాల ను ప్రదర్శిస్తారు.

అర్హతే ప్రామాణికం: దీని ద్వారా అర్హత ఉండి పథకాలు అందని వారికి అవకాశం కల్పించాలని సీఎం జగన్ అధికార యంత్రాంగానికి స్పష్టం చేసారు. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి పథకాలు అందించాలనేదే తమ లక్ష్యమని స్పష్టం చేస్తున్నారు. దీని ద్వారా ఏ ఒక్కరికీ పథకాలు అందలేదనే అభిప్రాయం కలగకూడనేది సీఎం జగన్ లక్ష్యం. దీంతో, ఇప్పుడు తాజాగా నిధులు విడుదల చేస్తున్నారు.
ఇదే సమయంలో ఎన్నికల వేళ మరిన్ని కొత్త నిర్ణయాల ప్రకటన పైన కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీని పైన త్వరలోనే అధికారికంగా నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం.












Click it and Unblock the Notifications