సీఎం జగన్ కు అగ్ని పరీక్ష- ఎమ్మెల్యేలకు నో ఛాన్స్ : వీరికి ఖాయం-ఢిల్లీ నేతల ఒత్తిడి..!!

సీఎం జగన్ కు ఇప్పుడు పాలనా పరంగా ఎదురవతున్న సవాళ్లతో పాటుగా మరొకటి అగ్ని పరీక్షగా మారుతోంది. ప్రతిష్ఠాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా రెండో సారి బాబాయ్ సుబ్బారెడ్డికి సీఎం జగన్ కేటాయించారు ఆ నియామకంలోనూ అనేక తర్జన-భర్జనలు-బుజ్జగింపులు జరిగాయి. ఇక, బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉంది. 2019లో అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్ పైన బోర్డు సభ్యులుగా అవకాశం కోరుతూ పెద్ద ఎత్తున ఒత్తిళ్లు వచ్చాయి. దీంతో..అప్పటి వరకు 17 మంది సభ్యులతో ఉండే టీటీడీ బోర్డు జంబోగా మారి 37 మందికి అవకాశం దక్కింది.

ఏపీతో పాటుగా పొరుగు రాష్ట్రాల వారికి ఛాన్స్..

ఏపీతో పాటుగా పొరుగు రాష్ట్రాల వారికి ఛాన్స్..

సాధారణంగా టీటీడీ బోర్డులో ఏపీ- తెలంగాణతో పాటుగా తమిళనడు..కర్ణాటక..మహారాష్ట్ర నుంచి ప్రాతినిధ్యం ఉంటుంది. ఇక, జాతీయ స్థాయి నేతలు తమ వారికి అవకాశం ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి పైన ఒత్తిడి తేవటం ప్రతీ బోర్డు ఏర్పాటులోనూ సాధారణంగా మారి పోయింది. ఇప్పుడు అదే జరుగుతోంది. దాదాపు 50 మంది పేర్లు సీఎం జగన్ ముందు ఉన్నట్లుగా సమాచారం. గతంలో వలే జంబో బోర్డు ఏర్పాటు చేస్తే 37 మంది వరకు అవకాశం దక్కుతుంది. అందులో జగన్ సైతం కాదనలేని పేర్లు ఉన్నట్లుగా చెబుతున్నారు.

 వైసీపీ ఎమ్మెల్యేలకు నో ఛాన్స్..

వైసీపీ ఎమ్మెల్యేలకు నో ఛాన్స్..

ఇక, నామినేటెడ్ పదవుల్లో ఈ మధ్య కాలంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేలకు జోడు పదవులు అవకాశం లేదని తేల్చేసారు. ఈ నిర్ణయంతో టీటీడీ బోర్డు తాజా నియామకంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఆశలు వదిలేసుకున్నారు. తొలి పాలక మండలిలో పలువురు ఎమ్మెల్యేలను సభ్యులుగా... చెవిరెడ్డి- కరుణాకర రెడ్డి-మల్లాది విష్ణు లకు తమ పోస్టుల కారణంగా ఎక్స్ అఫీషీయో సభ్యులుగా నియమితులయ్యారు. అయితే, సుబ్బారెడ్డిని తిరిగి ఛైర్మన్ గా నియమించిన సమయం..నియామక ఉత్తర్వుల్లో మాత్రం ఎంత కాలం ఈ పదవిలో కొనసాగే అంశం పైన స్పష్టత ఇవ్వలేదు.

ఈ బోర్డు ఏడాది కాలం వరకేనా...

ఈ బోర్డు ఏడాది కాలం వరకేనా...

ఇదే సమయంలో..సుబ్బారెడ్డి సైతం అమెరికా నుంచి తిరిగి రాగానే...తనకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలనే కోరిక ఉన్నది నిజమేనని..త్వరలో నే అది నెరవేరుతుందని చెప్పారు. దీంతో...సుబ్బారెడ్డి ఏదాడి మాత్రమే ఛైర్మన్ గా ఉంటారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక, తొలి విడత బోర్డులో ఉన్న వారిలో కొందరు ప్రముఖులు తిరిగి తమకూ బోర్డులో అవకాశం ఇవ్వాలని సీఎం పైన ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. ఈ సారి ఎమ్మెల్యేలకు సైతం అవకాశం లేకపోవటంతో..ఖాళీలు పెరుగుతాయని ఔత్సాహికులు అంచనా వేస్తున్నారు.

 కేసీఆర్ పేర్లు సిఫార్సు చేస్తారా..

కేసీఆర్ పేర్లు సిఫార్సు చేస్తారా..

తాము బోర్డు సభ్యులుగా ఉన్నా...కరోనా కారణంగా ప్రత్యక్ష సేవల్లో పాల్గొనలేకపోయామంటూ తమ వాదన వినిపిస్తున్నారు. అయితే, తెలంగాణ నుంచి గతంలో సీఎం కేసీఆర్ తో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఆయన సూచించిన వారికి జగన్ బోర్డులో అవకాశం కల్పించారు. ఈ సారి ఏం జరుగుతుందనేది ఆసక్తి కరమే. అయినా...కొందరికి జగన్ తిరిగి అవకాశం ఇవ్వటం ఖాయమంటూ కొన్ని పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న నేతలు కొన్ని పేర్లు సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. అదే సమయంలో ప్రముఖ పారిశ్రామిక వేత్తల నుంచి లిస్టులో పేర్ల కోసం ఒత్తిడి మొదలైంది.

రేసులో ప్రముఖుల పేర్లు..

రేసులో ప్రముఖుల పేర్లు..

అందులో..ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్, ఇన్ఫోసిసి్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ సుధామూర్తి, మైహోం అధినేత జూపల్లి రామేశ్వర రావు, రిలయన్స్ సంస్థల అధినేత్రి నీతూ అంబానీ, తమిళనాడు నుంచి ఏజే శేఖర్ కి ఖాయమని చెబుతున్నారు. వీరిలో ఇప్పటికే ఏజే శేఖర్ బోర్డు సభ్యుడిగా రూ 13 కోట్లతో అలిపిరిలో గోవు మందిరం నిర్మిస్తున్నారు. అదే విధంగా చెన్నైలో వేంకటేశ్వర ఆలయం కోసం మరో రూ1.1 కోట్లు విరాళం గా ఇచ్చారు. ఇక, ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్ బూంది పోటులో అదనపు నిర్మాణాల కోసం రూ 3 కోట్ల విరాళం అందించారు.

 జగన్ కు కీలక పరీక్ష..తుది లిస్టులో ఉండేదెవరో..

జగన్ కు కీలక పరీక్ష..తుది లిస్టులో ఉండేదెవరో..

ఇప్పుడు సీఎం టీటీడీ బోర్డు కూర్పు పైన ఫోకస్ పెట్టారని తెలియగానే ... పొరుగు రాష్ట్రాలతో పాటుగా పలు పార్టీల ముఖ్యులు సైతం తమ అనుయాయల పేర్లు సిఫార్సు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే, జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటు చేసిన తొలి బోర్డు సమయం...ఇప్పుడు రెండో బోర్డు ఏర్పాటు సమయానికి అనేక మందితో జగన్ కు రాజకీయ సమీకరణాల్లో మార్పులు జరిగాయి. దీంతో.. ముఖ్యమంత్రి చివరకు ప్రతిష్ఠాత్మకమైన టీటీడీ బోర్డులో ఎవరికి ఛాన్స్ ఇస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+