విజయవాడ కేంద్రంగా సీఎం జగన్ కొత్త చరిత్ర..!!

ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల సమరానికి సిద్దమవుతున్నారు. పాలనా - పార్టీ పరంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. సంక్షేమం, సామాజిక న్యాయం అస్త్రాలుగా ప్రత్యర్దులపై పోరాటానికి సై అంటున్నారు. జనవరి నెల ఆరంభం నుంచి పూర్తిగా ప్రజల మధ్యనే ఉండేలా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసారు. రెండు నెలల కాలంలో నాలుగు భారీ కార్యాక్రమాలకు నిర్ణయించారు. అందులో భాగంగా విజయవాడ కేంద్రం గా సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

జగన్ నిర్ణయాలు : సీఎం జగన్ జనవరి, ఫిబ్రవరి నెలల్లో కీలక కార్యక్రమాల ద్వారా ఎన్నికల సమరశంఖం పూరిస్తున్నారు. జనవరి 1న రూ 3 వేల పెన్షన్ అమలు ప్రారంభించనున్నారు. జనవరి 19న విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ముహూర్తం నిర్ణయించారు. 19 ఎకరాల్లో రూ.404 కోట్లతో 125 అడుగుల డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా ఈ విగ్రహాన్ని నిర్మిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. సచివాలయం స్థాయి నుంచి రాష్ట్రస్థాయివరకూ ప్రతి అడుగులోనూ సామాజిక న్యాయ నినాదం వినిపించాలని సూచించారు. ప్రతి సచివాలయం నుంచి 5 మందిని 19న జరిగే అంబేద్కర్‌ విగ్రహం ప్రారంభోత్సవానికి ఆహ్వానించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

CM Jagan to unveil the 125-ft tall statue of Dr BR Ambedkar in Vijayawada on January 19

విజయవాడ కేంద్రంగా : ప్రతి మండల కేంద్రం నుంచి ప్రత్యేకమైన బస్సులు నడుపాలని నిర్ణయించారు. దీని ద్వారా విజయవాడ కేంద్రంగా సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మంగా నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. విజయవాడ తొలి నుంచి టీడీపీకి అనుకూలంగా ఉంటోంది. 2019 ఎన్నికల్లో ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో టీడీపీ కేవలం రెండు స్థానాలే దక్కించుకుంది. విజయవాడ లోక్ సభ సీటు గెలుచుకుంది. ఈ సారి తన పట్టు కొనసాగించటం తో పాటుగా విజయవాడ లోక్ సభ పరిధిలో బీసీ అభ్యర్దిని తమ పార్టీ నుంచి బరిలోకి దింపాలని సీఎం జగన్ ఆలోచన చేస్తన్నట్లు తెలుస్తోంది. విజయవాడ కేంద్రంగా కీలక కార్యక్రమాల నిర్వహణ..డెవలప్ మెంట్ యాక్టివిటీ ద్వారా జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

CM Jagan to unveil the 125-ft tall statue of Dr BR Ambedkar in Vijayawada on January 19

ఎన్నికల కార్యాచరణ : ఇక..జనవరి 23 నుంచి 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ ఆసరా నిర్వహణకు నిర్ణయించారు. అదే విధంగా ఫిబ్రవరి 5 నుంచి 14వ తేదీ వరకు వైఎస్సార్ చేయూత అమలుకు నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1 నుంచి పెంచిన పెన్షన్ ద్వారా 66,34,742మందికి సుమారు రూ.1968 కోట్లకుపైగా పెన్షన్ల రూపంలో లబ్ది జరగనుంది. రానున్న రెండు నెలల కాలంలో దాదాపుగా కోటి పది లక్షల మంది మహిళలకు లబ్ది జరిగేలా పథకాల అమలు చేయనున్నారు. ఇప్పటికే కసరత్తు చేస్తున్న సీట్ల మార్పు..అభ్యర్దుల విషయంలో మరో రెండు రోజుల్లో పూర్తి చేసి వారి ద్వారా ఈ సంక్షేమ పథకాలను అమలు చేసేలా కార్యాచరణ డిసైడ్ చేసారు. దీంతో..కొత్త సంవత్సరంలో సీఎం జగన్ ఏపీలో తీసుకొనే రాజకీయ నిర్ణయాల పైన ఆసక్తి పెరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+