సీఎం జగన్ - రిషి రాజ్ కాంబో : 2024 గెలుపే లక్ష్యం : ఎవరీ కొత్త వ్యూహకర్త - ఏం చేయబోతున్నారు..!!
ముఖ్యమంత్రి జగన్ టార్గెట్ 2024 లో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపులో జగన్ తో పాటుగా రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ సేవలు అందించారు. ఆయన ఇప్పుడు వ్యూహకర్తగా దూరంగా ఉంటున్నారు. అయితే, ఇప్పుడు వైసీపికి వ్యూహకర్తగా ఎవరు పని చేస్తారనే చర్చ కొంత కాలంలో ఏపీ రాజకీయాల్లో వినిపిస్తోంది. ఇప్పుడు కొత్త వ్యూహకర్త ఖరారయ్యారు. సీఎం జగన్.. రాజకీయ వ్యూహకర్తగా రుషి రాజ్ సింగ్ ఇద్దరూ కలిసి 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేయనున్నారు.

ప్రశాంత్ కిషోర్ రోల్ ఇక రిషి ద్వారా
2019లో ప్రశాంత్ కిషోర్ నిర్వహించిన పాత్ర ఇప్పుడు వైసీపీ కోసం రుషి రాజ్ సింగ్ నిర్వహించ నున్నారు. ప్రశాంత్ కిషోర్ ప్రారంభించిన ఐ ప్యాక్ సహ వ్యవస్థాపకుడు ఈ రుషి రాజ్ సింగ్. ప్రస్తుతం ఐ ప్యాక్ నుంచి ప్రశాంత్ కిషోర్ వైదొలగటంతో..పాత మిత్రులు దీనిని నిర్వహిస్తున్నారు.
దీంతోనే.. మరోసారి వైసీపీ అగ్రిమెంట్ చేసుకుంది. ఇప్పటికే ఐ ప్యాక్ టీం క్షేత్ర స్థాయిలో తొలి విడత సర్వే చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాల పైన ప్రజాభిప్రాయం సేకరించినట్లు సమాచారం. ఈ నివేదికల సారాంశాన్ని పార్టీ వర్క్ షాప్ లో సీఎం జగన్ వెల్లడించే అవకాశం ఉంది.
Recommended Video


సీఎం జగన్ కు నమ్మక వ్యూహకర్త
ఇక, సీఎం జగన్ కు రుషి రాజ్ తో 2017 నుంచి పరిచయం ఉంది. ప్రశాంత్ కిషోర్ టీం లో కీలక సభ్యుడిగా..వైసీపీ కోసం ఆయన పని చేసారు. 2019 ఎన్నికల సమయంలో ఐ ప్యాక్ నివేదికను జగన్ తో చర్చించేవారు. రుషి ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ పూర్వ విద్యార్ధి. 2013లో సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ ను ప్రశాంత్ కిషోర్ తో కలిసి ప్రారంభించారు.
ఇక, 2014 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ తో కలిసి మోదీ ప్రధానిగా గెలవటం కోసం వ్యూహ రచనల్లో కీలక భూమిక పోషించారు. ఆ తరువాత ఐ ప్యాక్ పలు రాష్ట్రాల్లో పలు పార్టీల గెలుపు కోసం పని చేసిన సమయాల్లోనూ రిషి కీలకంగా వ్యవహరించారు. నితీశ్ కుమార్..కేజ్రీవాల్..మమతా బెనర్జీ..స్టాలిన్ గెలుపు వెనుక వ్యూహాల అమలులోనూ రిషి ప్రధాన భూమిక తీసుకున్నారు.

జగన్ - రిషి కాంబో.. టార్గెట్ 2024 ఎన్నికలు
రిషితో నాటి నుంచి ఉన్న సాన్నిహిత్యంతో ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ రానున్న ఎన్నికల కోసం ఆయన వ్యూహకర్తగా తన పార్టీకి సేవలించేందుకు అంగీకరించారు. ఐ ప్యాక్ టీం నుంచి క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు...ఎమ్మెల్యేల సమర్ధత..ప్రజల మద్దతు..సీఎం కు సానుకూలత వంటి అంశాల పైన ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. దీంతో..ఇక నుంచి రిషి పూర్తి స్థాయిలో వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా తన టీంతో కలిసి సేవలు అందించనున్నారు. దీంతో...ఈ రిషి శక్తి సామర్ధ్యాలు..వైసీపీకి కలిసొచ్చే ప్రయోజనాల పైన పార్టీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications