సీఎం జగన్ ఇంట విషాదం: మామ గంగిరెడ్డి మృతి..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటిలో విషాదం నెలకొంది. జగన్ మామ ఈసీ గంగిరెడ్డి మృతిచెందారు. జగన్ సతీమణి భారతీ తండ్రి గంగిరెడ్డి. ఆయన ప్రముఖ వైద్యులు, పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేవారు. అయితే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చనిపోయారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామం గొల్లల గూడూరు తరలించారు.

ఎంపీపీగా పనిచేసి..
ఈసీ గంగిరెడ్డి వైద్యుడు.. కానీ రాజకీయాల్లో కూడా పనిచేశారు. 2001-2005 వరకు పులివెందుల ఎంపీపీగా పనిచేశారు. రైతులకు రబీ విత్తనాల కోసం పులివెందుల నుంచి కడప కలెక్టరేట్ వరకు పాదయాత్ర కూడా చేశారు. కానీ తర్వాత పేదలకు వైద్యం చేస్తూ.. రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. నిరుపేదలకు వైద్యం అందించేవారు. అందుకే గంగిరెడ్డిని పేదల డాక్టర్ అని పిలుచుకునేవారు.

విషాద వదనం..
గంగిరెడ్డి మృతితో విషాదం నెలకొంది. ఆయన మృతదేహాన్ని వేముల మండలంలో గల గొల్లలగూడూరు తరలించారు. అక్కడ అంత్యక్రియలను ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహిస్తారు. అంతిమ సంస్కారాలకు సీఎం జగన్ కుటుంబంతో సహా హాజరవుతారు.
విజయసాయి సంతపాం..
గంగిరెడ్డి మృతిపై విజయసాయి రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి వార్త తెలిసి షాక్‌నకు గురయ్యానని తెలిపారు. వైద్యునికి, రాజకీయ నేతగా పని చేసి గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. అతని పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

విజయ్ చందర్ సంతాపం
ఈసీ గంగిరెడ్డి మృతిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ది సంస్థ చైర్మన్ విజయ్ చందర్ షాక్‌నకు గురయ్యారు. మంచి మనిషి, పేదల వైద్యుడిని కోల్పోయామని చెప్పారు. గంగిరెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్












Click it and Unblock the Notifications