వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్ ఆన్ ఫైర్ : ఈసీ డెసిషన్ పై విస్మయం..గవర్నర్‌తో కీలక మీటింగ్ సంచలన నిర్ణయాల దిశగా..!

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఒకే ఒక నిర్ణయంతో పొలిటికల్ హీట్ క్రియేట్ అయ్యింది. ఆరు వారాల పాటు ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తే ఆ సమయంలో కోడ్ అమలులోనే ఉంటుందని ఎన్నికల సంఘం అధికారి రమేష్ కుమార్ ప్రకటించడంతో ఒక్కసారిగా రాజకీయ వేడి కనిపించింది. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో విస్మయం చెందిన సీఎం జగన్ వెంటనే గవర్నర్‌ను కలిశారు. అయితే గవర్నర్‌తో జరిగిన భేటీలో ఏ అంశాలు సీఎం జగన్ ప్రస్తావనకు తీసుకొచ్చారు...?

ఈసీ నిర్ణయంపై జగన్ అసంతృప్తి

ఈసీ నిర్ణయంపై జగన్ అసంతృప్తి

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు ఆయా పార్టీలు సన్నద్ధమవుతున్న వేళ ఎన్నికల సంఘం కరోనావైరస్ పేరుతో ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి అధికార పార్టీకి షాక్ ఇచ్చింది. ఈ నెలాఖరు కల్లా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగించాలని భావించిన ప్రభుత్వానికి ఆరువారాల పాటు ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. ఎన్నికల సంఘం నిర్ణయంతో విస్మయం చెందిన సీఎం జగన్ హుటాహుటిన గవర్నర్ హరించందన్‌ను కలిశారు.

 గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన జగన్

గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన జగన్

గవర్నర్ హరిచందన్‌ను కలిసిన సీఎం జగన్ పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. ప్రభుత్వంతో సంప్రదించకుండా ఎన్నికల అధికారి రమేష్ కుమార్ నిర్ణయం తీసుకున్నారని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. కరోనా వైరస్‌పై రాష్ట్రంలో ఉన్న పరిస్థితి గురించి ఎలాంటి నివేదిక తెప్పించుకోకుండానే ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం సరికాదని గవర్నర్ హరిచందన్ దృష్టికి తీసుకొచ్చారు సీఎం జగన్. ఇక తన ప్రభుత్వంలో అధికారులను సైతం ఎన్నికల సంఘం బదిలీ చేయడంపై సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

 అధికారుల బదిలీలపై అసంతృప్తి వ్యక్తి చేసిన జగన్

అధికారుల బదిలీలపై అసంతృప్తి వ్యక్తి చేసిన జగన్

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం పలు జిల్లాల్లో కలెక్టర్లను పలు చోట్ల పోలీసు అధికారులను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై అసహనం వ్యక్తం చేశారు సీఎం జగన్. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పలు చోట్ల జరిగిన ఘర్షణలపై డీజీపీ వివరణ ఇచ్చాక కూడా అధికారులపై బదిలీవేటు వేశారనే అంశాన్ని కూడా గవర్నర్ దృష్టికి సీఎం తీసుకొచ్చినట్లు సమాచారం. మరోవైపు కరోనా వైరస్ ఇప్పటిది కాదని ఆ విషయం తెలిసి ముందుగానే ఎన్నికల కమిషన్ ఎందుకు ప్రభుత్వం నుంచి నివేదిక కోరలేదని మంత్రులు అంతర్గతంగా ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలన్న అకస్మిక నిర్ణయం వెనక కారణమేంటనే కోణంలో చర్చిస్తున్నారు. ప్రతిపక్షాల ఆరోపణలతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా అనే చర్చ సైతం జరుగుతోంది.

పాలనాపరంగా ఇబ్బందులని చెప్పిన జగన్

పాలనాపరంగా ఇబ్బందులని చెప్పిన జగన్


ఇక ఎన్నికలు వాయిదా వేయాలన్న నిర్ణయంపై అసహనంతో ఉన్న సీఎం జగన్ ఎన్నికల కమిషనర్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఆరువారాలపాటు ఎన్నికల కోడ్ కొనసాగుతుందని చెప్పడం పాలనాపరంగా పలు ఇబ్బందులు ఎదురవుతాయని గవర్నర్ దృష్టికి సీఎం తీసుకొచ్చినట్లు సమాచారం. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఇప్పటికే పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ వాయిదా వేసుకున్నట్లు గవర్నర్‌కు వివరించినట్లు తెలుస్తోంది. ఎన్నికల కోసమే 10వ తరగతి పరీక్షలు వాయిదా వేసినట్లు సీఎం జగన్ గవర్నర్‌కు చెప్పినట్లు సమాచారం. ఏప్రిల్‌లో ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి డిగ్రీ పరీక్షలు జరుగుతాయని సీఎం గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు.

ఎన్నికల కారణంగానే ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను పెట్టుకున్నామని గవర్నర్‌కు వివరించిన జగన్... ఈ సమయంలో ఎన్నికలను వాయిదా వేయడం సరికాదని చెప్పారు. ప్రభుత్వం నేరుగా గవర్నర్‌కు ఎన్నికల సంఘంపై ఫిర్యాదు చేయడంతో ఎన్నికల కమిషనర్ నుంచి గవర్నర్ నివేదిక కోరే అవకాశం ఉంది. ఇక న్యాయ సలహాలు తీసుకునేందుకు కూడా సీఎం జగన్ అడ్వకేట్ జనరల్‌ను కూడా రాజ్‌భవన్‌కు పిలిపించారు.

English summary
Taking decision to postpone local body elections, AP CM expressed his unhappiness over AP election commission. CM Jagan took the matter to Governor Harichandan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X