విశాఖలో సీఎం జగన్ - అక్కడే స్పష్టత ఇస్తారా : గవర్నర్ తో భేటీ - ఢిల్లీ పరిణామాలతో..!!

గేర్ మారుస్తున్నాం..అందరూ సిద్దం కావాలంటూ పార్టీ ముఖ్య నేతలకు పిలుపునిచ్చిన సీఎం జగన్ విశాఖ లో పర్యటిస్తున్నారు. సీఎం జగన్ ఈ రోజు విశాఖ..అనకాపల్లి జిల్లాల్లో పర్యటనకు రానున్నారు. ఇళ్లపట్టాలు, హౌసింగ్‌ స్కీమ్‌ పత్రాలు సీఎం జగన్​ పంపిణీ చేయనున్నారు. సీఎం జగన్ తాడేపల్లి నుంచి బయల్దేరి 10.40కి అనకాపల్లి జిల్లా... సబ్బవరం చేరుకోనున్నారు. ఉదయం 11.05 గంటలకు వేదిక వద్దకు చేరుకుని వైఎస్సార్‌ విగ్రహావిష్కరణ, పార్కు ప్రారంభోత్సవం సహా లే అవుట్లను పరిశీలించనున్నారు.

సీఎం జగన్ ప్రతిష్ఠాత్మక పథకం..

సీఎం జగన్ ప్రతిష్ఠాత్మక పథకం..

1.23 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ జరగనుంది. లే అవుట్‌ స్వరూపాన్ని పరిశీలించిన అనంతరం మోడల్‌ గృహాల్ని లబ్ధిదారులకు అందజేస్తారు. తర్వాత పైలాన్‌ను ఆవిష్కరించి, భూ సమీకరణకు సహకరించిన రైతులతో కాసేపు మాట్లాడి, వారితో ఫొటోలు దిగనున్నారు. అనంతరం సభా ప్రాంగణంలో లబ్ధిదారులతో మాట్లాడతారు.

ఆ తర్వాత మధ్య తరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చే ఎంఐజీ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయాలని భావించారు. కానీ, కోర్టు తీర్పు.. న్యాయ పరమైన అంశాలతో ఆ ఆలోచన ఆచరణ సాధ్యం కాలేదు.

ఎగ్జిక్యూటివ్ రాజధాని పైన స్పష్టత ఇస్తారా

ఎగ్జిక్యూటివ్ రాజధాని పైన స్పష్టత ఇస్తారా

ఇక, ఇప్పుడు ఎన్నికల దిశగా వేగంగా అడుగులు వేస్తున్న సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన.. ఏం చేయబోతున్నారనే స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. విశాఖ కేంద్రంగానే ఈ అంశం పైన సీఎం స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి మూడు రాజధానుల అంశం ఎన్నికల ప్రచార అంశంగా మారే ఛాన్స్ ఉంది.

దీంతో..ముందుగానే దీని పైన స్పష్టమైన వైఖరితో ముందుకెళ్లాలని వైసీపీ భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా..ఈ రోజున విశాఖ పర్యటనలో సీఎం దీని పైన స్పందిస్తారని చెబుతున్నారు. అయితే, సీఎం ఏం చెప్పబోతున్నారు...ఎటువంటి క్లారిటీ ఇస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

గవర్నర్ తో సీఎం కీలక భేటీ

గవర్నర్ తో సీఎం కీలక భేటీ

విశాఖ పర్యటన పూర్తయిన తరువాత ముఖ్యమంత్రి జగన్ ఈ సాయంత్రం గవర్నర్ బిశ్వభూషణ్‌తో సమావేశం కానున్నారు. గవర్నర్ తాజా ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ..గవర్నర్ అమిత్ షా తో సమావేశం అయ్యారు. రేపు (29న) సీఎం జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. 30న ప్రధాని మోదీ - సప్రీం ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో జరిగే సదస్సులో ఆయన పాల్గొననున్నారు.

ఇప్పటికే ఆ అంశంలో ఏపీకి సంబంధించిన అంశాల పైన చర్చించేందుకు ఇప్పటికే ఏపీ హైకోర్టు సీజేతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఇక, మే నుంచి సీఎం జగన్ సైతం వారంలో కనీసం ఒక్క జిల్లా పర్యటన చేసే విధంగా షెడ్యూల్ ఖరారు చేస్తున్నట్లు గా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+