CM Jagan: 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి.. లబ్దిదారులకు అందజేయనున్న సీఎం జగన్..

ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలోనే రికార్డు నమోదు చేసింది. ఇప్పటికే 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసింది. వీటిని త్వరలో పేదలకు పంపిణీ చేయనున్నారు. నవరత్నాల్లో భాగంగా ఇళ్లు లేని పేదలకు పక్కా గృహాలు కట్టించి ఇవ్వాలని జగన్ ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుంది. పూర్తయిన ఇళ్లను లబ్దీదారులకు పంపిణీ చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 5,00,653 ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తియిందని.. కొన్ని పనులు మిగిలి ఉన్నాయని అవి సోమవారంతో పూర్తవుతాయని అధికారులు ప్రకటించారు.

వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే పేదల కోసం ఇళ్ల నిర్మించాలని నిర్ణయించింది. ఇళ్ల నిర్మాణం ప్రారంభించింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఇళ్ల నిర్మాణం కొనసాగించింది. కోర్టులో ద్వారా అడ్డుకోవాలని చూసినా.. పేదల ఇళ్ల ఇవ్వాలనే ధృఢ సంకల్పంతో పనులు చేపట్టామని మంత్రులు చెబుతున్నారు. ఇళ్ల నిర్మాణం ప్రారంభించిన కొద్ది రోజులకు కరోనా, ఆ తర్వాత వర్షాల వల్ల పనులు ఆలస్యమైనట్లు అధికారులు చెబుతున్నారు. ఏదీఏమైనప్పటికీ పనులు మాత్రం పూర్తి చేసినట్లు
అధికారులు వివరిస్తున్నారు.

CM Jagan will hand over 5 lakh houses completed in AP to the beneficiaries

పూర్తయిన ఇళ్లను అర్హులైన మహిళల పేరుపై ఇవ్వనున్నారు. ఇళ్లు కట్టుకోవాలనుకునే వారికి ప్రాంతాన్ని బట్టి ప్రభుత్వం రూ.15 లక్షల వరకు విలువైన స్థలాలను ఉచితంగా పంపిణీ చేసింది. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు ఇవ్వడంతో పాటు పావలా వడ్డీకి రూ.35 వేల బ్యాంకు రుణం కూడా ఇప్పిస్తోంది. ఇంటి నిర్మాణానికి ఉచితంగా ఇసుక కూడా సరఫరా చేస్తున్నారు. రాష్ట్రంలో 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి నిత్యం కృషి చేసిన గృహ నిర్మాణ, ఇతర శాఖల అధికారులు, ఉద్యోగులకు సీఎం జగన్ అభినందించారు.

ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని సూచించారు. మిగిలిన ఇళ్ల నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. త్వరలోనే వైఎస్సార్, జగనన్న కాలనీల్లో గృహప్రవేశ వేడుకలు చేయనున్నామని అధికారులు తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు సీఎం జగన్ చేతుల మీదుగా ఇంటి పత్రాలతో పాటు, ఇంటి తాళాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాల్లో ప్రజాప్రతినిధులు ఇళ్లు పంపిణీ చేస్తారని ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+