CM Jagan: ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జగన్..
మరికొద్ది గంటల్లో నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో సీఎం జగన్ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 2024లో ఇంటింటా ఆనందాలు, ప్రతి కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లివిరియాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. "రాష్ట్ర ప్రజలతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024లో ఇంటింటా ఆనందాలు, ప్రతీ కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లివిరియాలి" అని కోరుకున్నారు.
అన్ని ప్రాంతాలు, అన్ని సామాజిక వర్గాలు సుస్థిరమైన అభివృద్ధి పథంలో ప్రయాణించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఒక్క కుటుంబంలో ప్రతీ ఒక్కరికీ 2024లో దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. జగన్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలతో ముందుకెళ్తున్నారు. పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా కృషి చేస్తున్నారు.

జనవరి నెలలో సీఎం జగన్ వరుసగా మూడు ప్రధాన పథకాలను అమలు చేయనున్నారు. జనవరి 1 నుంచి రూ3 వేల వైఎస్సార్ పెన్షన్ కానుక అమలు చేయనున్నారు. జనవరి 3న ముఖ్యమంత్రి జగన్ కాకినాడ కేంద్రం గా ఈ పథకం అమలు చేస్తారు. పొదుపు సంఘల మహిళలకు ఆసరా పధకం కింద ఇప్పటి వరకు రూ 25,570 కోట్లు ఖర్చు చేసారు. మూడు విడతలుగా ఇప్పటి వరకు రూ 19,195 కోట్లు అందించారు.
నాలుగో విడతగా చివరి ఇనిస్టాల్ మెంట్ కింద సుమారు రూ 6,400 కోట్లను జనవరి 23న విడుదల చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు.
జనవరి 23వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగించాలని సీఎం స్పష్టం చేశారు. ఆసరా కార్యక్రమం ద్వారా 78.94 లక్షల మంది మహిళలకు లబ్ది చేకూరుతోన్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 5 నుంచి 14 వరకూ వైయస్సార్ చేయూత కార్యక్రమం జరుగుతుందని సీఎం వెల్లడించారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకూ రూ.14,129 కోట్లు ఇచ్చినట్లు వివరించారు.












Click it and Unblock the Notifications