ఆషాడం ఎఫెక్ట్: కెసిఆర్ కేబినెట్లోకి సురేఖ, మరో 5గురు..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ జూన్ నెలాఖరులోగా కేబినెట్‌ను 18కి పెంచుకునే అవకాశాలున్నాయంటున్నారు. దీంతో మాజీ మంత్రి, వరంగల్ జిల్లా సీనియర్ సభ్యురాలు కొండా సురేఖ వంటి వారికి చోటు దక్కే అవకాశముంది. కెసిఆర్‌కు ముహూర్తం, న్యూమరికల్ సెంటిమెంట్స్ ఉన్న విషయం తెలిసిందే. ఈ నెలాఖరులో ఆషాడ మాసం ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఆషాడ మాసం వచ్చేలోగా కేబినెట్‌ను పెంచుకోవాలని చూస్తున్నారట.

జూన్ 28 నుండి జూలై 26వ తేదీ వరకు ఆషాడ మాసం ఉంది. దీంతో జూన్ 28వ తేదీలోపు కెసిఆర్ మరో ఆరుగురిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశముందు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి సహా 18 మంది మంత్రులు ఉండొచ్చు. అంతకు మించకూడదు. కెసిఆర్ సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు పదకొండు మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. 12 మంది కేబినెట్లో ఉన్నారు. దీంతో మరో ఆరుగురికి మాత్రమే కేబినెట్లో చోటు దక్కనుంది.

CM KCR to have bigger team by June end

ఇన్నాళ్లు కెసిఆర్ అసెంబ్లీ సమావేశాలు, కొత్త రాష్ట్రమైనందున అధికారులతో బిజీబిజీగా ఉన్నారు. ఆషాడమాసం వస్తుండటంతో కేబినెట్ పెంచుకునే అంశంపై దృష్టి సారిస్తున్నారట. కేబినెట్లో చోటు దక్కించుకునేందుకు పలువురు రేసుల ఉన్నారు. ప్రస్తుతం కెసిఆర్ కేబినెట్లో మహిళలకు చోటు దక్కలేదు. దీంతో ఓ మహిళను తీసుకోనున్నారు.

మహిళల్లో నిన్నటి రేసులో కొండా సురేఖ, పద్మా దేవేందర్ రెడ్డిలు ముందు వరుసలో ఉన్నారు. పద్మాను డిప్యూటీ స్పీకర్‌గా చేశారు. ఈ నేపథ్యంలో సురేఖకు మంత్రి పదవి దక్కనుంది. మిగతా ఐదుగురి రేసులో ముఖ్యంగా... ఎమ్మెల్సీ స్వామి గౌడ్, ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, జూపల్లి కృష్ణా రావు, లక్ష్మా రెడ్డి, జలగం వెంకట్రావులు ఉన్నారు. అయితే, కెసిఆర్ శ్రీనివాస్ గౌడ్‌ కంటే స్వామి గౌడ్ వైపే మొగ్గు చూపుతున్నారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+