50 లక్షలపై జగన్‌కు సీఎం సవాల్, పోలీస్ స్టేషన్లు పెట్టాల్సిందే: గాలి
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో రూ.50 లక్షలు తనవని తేలుతో తాను పార్లమెంటు సభ్యుత్వానికి రాజీనామా చేస్తానని, దీనిని సాక్షి పత్రిక నిరూపించగలదా? అని ఎంపీ సీఎం రమేష్ బుధవారం సవాల్ చేశారు. తన ఖాతాల నుండి రూ.50 లక్షలు వెళ్లినట్లు నిరూపించకుంటే జగన్ రాజీనామాకు సిద్ధమా అన్నారు.
ఎన్టీఆర్ భవన్ వద్ద ఉద్రిక్తత
ఎన్టీఆర్ భవన్, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీ పోలీసులతో ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు.
గవర్నర్‌కు కొనసాగే నైతిక హక్కు లేదు: సూర్యారావు

గవర్నర్ నరసింహన్‌కు కొనసాగే హక్కు లేదని టీడీపీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అన్నారు. ఇంత జరుగుతున్నా గవర్నర్ మౌనముద్రలో ఎందుకు ఉన్నారని ప్రశఅనించారు. ఆయన వ్యవహార శైలి పైన తమకు సందేహాలు ఉన్నాయని చెప్పారు. తెరాస, వైసీపీలు కుట్రలు చేస్తున్నాయన్నారు.
కేసీఆర్, జగన్ దిష్టిబొమ్మల దగ్ధం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరులో జగన్, కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ ధర్నాకు దిగింది. తెలంగాణ సర్కారు ఫోన్ ట్యాపింగ్ చేయడం చట్ట విరుద్ధమని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన అధికారులను అరెస్టు చేయాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు.
పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సిందే: గాలి
హైదరాబాదులో తమకు రక్షణ లేకుండా పోయిందని గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. హైదరాబాదులో ఏపీ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేయాల్సిందేనని చెప్పారు. తెలంగాణ ఏసీబీ కేసీఆర్ తొత్తుగా మారిందన్నారు. తెరాస నేతలు తెలుగువారి ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యవహరిస్తోందన్నారు. స్టీఫెన్ సన్‌ను అరెస్టు చేసి విచారించాలన్నారు. హైదరాబాద్ మీ అబ్బ సొత్తు కాదని, ఐదు కోట్ల మంది ఆంధ్రులకూ హక్కుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు.












Click it and Unblock the Notifications