మాకీ పరిస్థితి ఎందుకు: సీఎం రమేష్, బాబు-కెసిఆర్ కలిసే: కేకే
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్ర రావు శుక్రవారం నాడు రాజ్యసభలో ప్రత్యేక హోదా ప్రయివేటు మెంబర్ బిల్లును ప్రవేశ పెట్టారు. దీనిపై పలువురు ఎంపీలు మాట్లాడారు. హోదా పైన కేంద్రమంత్రి వెంకయ్య, ఏపీ సీఎం చంద్రబాబు స్పందించాలని కాంగ్రెస్ ఎంపీలు కేవీపీ, జేడీ శీలం డిమాండ్ చేశారు. దీనిపై టిడిపి ఎంపీ సీఎం రమేష్ స్పందించారు.
ఏపీకి ఈ పరిస్థితి ఎందుకొచ్చింది: సీఎం రమేష్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలుమార్లు ఢిల్లీకి వచ్చి ఏపీ హామీలను ప్రస్తావించారని చెప్పారు. కాంగ్రెస్ నేతలు తమ అధినేతను ప్రశ్నించలేరని అభిప్రాయపడ్డారు. అసలు ఏపీకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని, ఎందుకు ఇబ్బందుల్లో ఉందని... కాంగ్రెస్ పార్టీ వల్లే ఇదంతా అన్నారు.
తమ ముఖ్యమంత్రి (చంద్రబాబు) ఆరేడుసార్లు ప్రధాని మోడీని కలిశారని, హామీల గురించి, ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించారని చెప్పారు. విభజన చట్టంలో చాలా లొసుగులు ఉన్నాయని చెప్పారు. అది కాంగ్రెస్ పార్టీ చేసిన ఫలితమే అన్నారు. ఏపీని కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిందన్నారు.

విభజసమయంలో కాంగ్రెస్ సకరత్తు చేయలేదు, అది చేస్తా ఇది చేస్తామని తప్పుటు హామీలు, ఢిల్లీ వచ్చిన ప్రతిసారి సాయం కోరుతున్నారు, ఏపీని కాంగ్రెస్ నాశనం చేసింది, విద్యా సంస్థల నిర్మాణాలకు భూమి కేటాయించి శంకుస్థాపన చేసాం,
తెలంగాణ, ఏపీలు సహకరించికుంటున్నాయి: కేకే
కేకే మాట్లాడుతూ.. ఏపీ, తెలంగాణలు పరస్పరం సహకరించుకోవాలన్నారు. ఏపీలాగే తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు. రేండేళ్లయినా ఏపీలో హైకోర్టు ఏర్పాటు చేయలేదన్నారు. గిరిజిన వర్సిటీ, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలన్నారు.
నాడు విభజన బిల్లు ప్రజాస్వామ్యయుతంగా ఆమోదం పొందిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్ చేస్తే మంచిదన్నారు. ఏపీ, తెలంగాణలు పరస్పరం సహకరించుకుంటున్నాయన్నారు. ఏపీలాగే తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు. కమలనాథన్ కమిటీ ఉద్యోగుల కేటాయింపును పూర్తి చేయలేదన్నారు. తెలంగాణలో అసెంబ్లీ సీట్లను 153కు పెంచాలన్నారు.
ఇదిలా ఉండగా, కేవీపీ రామచంద్ర రావు ప్రవేశ పెట్టిన ప్రత్యేక హోదా ప్రయివేటు మెంబర్ బిల్లు పైన రాజ్యసభ నిర్ణయం తీసుకోలేదు. కోరం లేనందున నిర్ణయం తీసుకోలేదు. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేశారు. కోరం లేకపోవడంపై టిడిపి అభ్యంతరం తెలిపింది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications