హైడ్రా కు మరిన్ని అధికారాలు - నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్..!!

నగరంలో హైడ్రా దూకుడు కొనసాగుతోంది. ఆక్రమణ దారులకు నోటీసులు జారీ అవుతున్నాయి. తాజాగా దుర్గం చెరువు పరిధిలో నిర్మాణాలకు నోటీసులు ఇచ్చారు. సీఎం రేవంత్ సోదరుడుకు నోటీసు జారీ అయింది. ఇదే సమయంలో హైడ్రా పేరుతో అవినీతికి పాల్పడుతున్న ఫిర్యాదుల పైన సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. అటు సీఎస్ శాంతి కుమారి ఓఆర్ఆర్ ఆక్రమణల నిర్మూలన బాధ్యతలను హైడ్రా కు అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చారు.

రేవంత్ ఆగ్రహం
హైడ్రాపై పెద్ద ఎత్తున ఫిర్యాదుల పై రేవంత్ స్పందించారు. వరుస ఫిర్యాదులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. హైదరాబాద్‌లో హైడ్రా పేరు చెప్పి భయపెట్టి.. బెదిరించి కొందరు కిందిస్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని వెల్లడించారు. దీని పైన ఉన్నతాధికారులకు ఆదేశాుల జారీ చేసారు. గ‌తంలో ఇచ్చిన‌ నోటీసులు, రెండు మూడేండ్ల కింద‌టి ఫిర్యాదుల‌ను అడ్డంగా పెట్టుకొని కొన్ని చోట్ల రెవిన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు డ‌బ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వ‌చ్చింద‌ని చెప్పారు.

CM Revanth serious over Corruption by HDRA name CS issues latest orders for HYDRA

చర్యలు తప్పవు
అటువంటి వారిపై చ‌ర్యలు త‌ప్పవ‌ని సీఎం వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి వ‌సూళ్లకు పాల్పడే వారిపై ఫోక‌స్ పెట్టాల‌ని ఏసీబీ, విజిలెన్స్ అధికారుల‌ను ముఖ్యమంత్రి అప్రమత్తం చేశారు. కాగా హైడ్రాపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా ఓఆర్ఆర్ పరిధిలోని అన్ని చెరువులు, పార్కులు, నాలాలతో పాటు అన్ని ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యతలను పూర్తి స్థాయిలో హైడ్రా కు అప్పగించేందుకు విధి విధానాలను రూపొందిస్తున్నట్టు తెలిపారు. అన్ని రకాల నోటీసులు, తొలగింపులన్నీ పూర్తిగా ఒకే విభాగం హైడ్రా పరిధిలోకి తేనున్నట్టు వివరించారు.

ఓఆర్ఆర్ బాధ్యతలు
చెరువుల ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై రాష్ట్ర హై-కోర్టు జారీ చేసిన ఆదేశాలను పరిగణంలోకి తీసుకుంటూ, ప్రభుత్వ స్థలాలు, చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకై హైడ్రాకు మరిన్ని అధికారాలను, సిబ్బందిని అప్పగించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ఓఆర్ఆర్ పరిధిలో అన్ని విధాలా ఆక్రమణల తొలగింపు నోటీసులను హైడ్రా ద్వారానే చేపట్టేందుకు విధి విధానాలు ఖరారు చేయాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. హైడ్రాకు కావాల్సిన అదనపు అధికారులు, సిబ్బందిని త్వరలోనే కేటాయించనున్నట్టు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+