కౌంటింగ్ వేళ జగన్ రిక్వెస్ట్ - రేవంత్ యాక్సెప్ట్..!?
రాష్ట్ర విభజన పూర్తయి పదేళ్లు అవుతోంది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన పూర్తి కావాల్సి ఉంది. జూన్ రెండో తేదీతో ఉమ్మడి రాజధానిగా పదేళ్ల కాలం పూర్తవుతుంది. భవనాలను స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే అధికారులను ఆదేశించారు. తమకు కేటాయించిన భవనాలను మరికొంత కాలం కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కోరింది. దీని పైన సీఎం రేవంత్ నిర్ణయం తీసుకోన్నారు.
విభజనకు పదేళ్లు
హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన భవనాల విషయంలో త్వరలో స్పష్టత రానుంది. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ నగరం పదేళ్ల పాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యకలాపాలు పూర్తిగా అక్కడకు తరలిన తర్వాత హైదరాబాద్‌లో ఆ రాష్ట్ర అవసరాల కోసం కొన్ని భవనాలను కేటాయించారు. రాజ్‌భవన్ రోడ్‌లో ఉన్న లేక్‌వ్యూ అతిథిగృహం, లక్డీకాపుల్‌లో పోలీసు విభాగానికి చెందిన సీఐడీ భవనంతో పాటు ఆదర్శనగర్‌లోని హెర్మిటేజ్ కాంప్లెక్స్‌ను ఏపీ అవసరాల కోసం కేటాయించారు. ఇప్పటి వరకు ఆ భవనాలు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి.

ఏపీ భవనాల స్వాధీనం
ఏపీ కార్యకలాపాల కోసం వాటిని వినియోగిస్తున్నారు. మంత్రులు, ఇతరులు, అధికారులు, ఇతరత్రా అవసరాల కోసం వాడుతున్నారు. జూన్ రెండో తేదీతో పదేళ్ల కాలం పూర్తవుతున్నందున ఉమ్మడి రాజధాని అన్న అంశం ఉండదు. దీంతో ఆ భవనాలన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే అధికారులకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం ఆ భవనాలను కొన్నాళ్ల పాటు తమకే కొనసాగించాలని తెలంగాణను కోరింది. ఈ మేరకు ఏపీ నుంచి గతంలోనే లిఖితపూర్వకంగా విజ్ఞప్తి వచ్చింది. దానిపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణా కమిషన్ కార్యాలయాన్ని ఇటీవలే కర్నూలుకు తరలించారు.
రేవంత్ దే తుది నిర్ణయం
భవనాల స్వాధీనం సహా విభజన అంశాలపై మంత్రివర్గంలో చర్చించాలని సీఎమ్ రేవంత్ రెడ్డి తొలుత భావించారు. ఈసీ అభ్యంతరంతో నిర్ణయం వాయిదా పడింది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఈ అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. లేక్ వ్యూ అతిథి గృహం అవసరం చాలా ఉందని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వ అతిథులు, కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు హైదరాబాద్ వస్తే ప్రస్తుతం సరైన వసతి లేదని, హోటళ్లలో వసతి కల్పించాల్సి వస్తోందని చెప్తున్నారు. దీంతో..ఏపీ ప్రభుత్వ రిక్వెస్ట్ పై రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.
-
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications