టార్గెట్: కేసీఆర్ రామోజీ ఫిల్మ్ సిటీ పర్యటన వెనుక...?

హైదరాబాద్: కొద్ది రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రామోజీ ఫిల్మ్ సిటీలో గంటలపాటు గడిపిన విషయం తెలిసిందే. నగరంలో లేదా తెలంగాణ రాష్ట్రంలోని సీమాంధ్ర ప్రజలలో తన పట్ల పాజిటివ్‌నెస్ తీసుకు వచ్చేందుకే కేసీఆర్ ఆయన అక్కడ గడిపారని, అలాగే ఆర్ఎఫ్సీకి అనుకూలంగా ప్రకటన చేశారని అంటున్నారు.

ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు నగరంలోని ప్రజలు ఎవరి వైపు ఉందో తెలుసుకునేందుకు సర్వే చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వర రావు చేరికల అనంతరం, కేసీఆర్ రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లి వచ్చిన తర్వాత ఈ సర్వే చేసినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కాస్త సమయం ఉన్నప్పటికీ... నగరంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉన్నాయి. అలాగే తలసాని రాజీనామాను ఆమోదించే పరిస్థితి వస్తే సనత్ నగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో అంతర్గత సర్వేలు చేసినట్లుగా చెబుతున్నారు.

CM’s tour of RFC has sent a positive signal in the Seemandhra community

కేసీఆర్ వరుసగా జిల్లాల్లో పర్యటిస్తున్న విషయం కూడా తెలిసిందే. వరంగల్ జిల్లాలో నాలుగు రోజులు ఉన్నారు. ఆ సమయంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు రేవంత్ రెడ్డి ఓ ఆరోపణ చేశారు. వరంగల్లో ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఆయన నాలుగు రోజుల పాటు అక్కడున్నారని విమర్సించారు.

హైదరాబాదులో 150 మున్సిపల్ డివిజన్లు ఉన్నాయి. గ్రేటర్ పరిధఇలో 24 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2009లో కాంగ్రెస్ పార్టీ 52 సీట్లు, తెలుగుదేశం 45, మజ్లిస్ 43, బీజేపీ 5, ప్రజారాజ్యం 1 మున్సిపల్ డివిజన్లను గెలుచుకున్నాయి. తెరాస మాత్రం ఒక్కటి కూడా గెల్చుకోలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+