తమిళనాడుకు మసాలా కావాలి..: చంద్రబాబు: తిప్పి కొట్టిన విజయ్ పార్టీ- సవాల్
ఏపీ, తమిళనాడు మధ్య పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై రాజకీయ విభేదాలు తలెత్తాయి. విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన "మసాలా" వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడులో వేడి పుట్టించాయి. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలో అక్కడ అధికారంలో ఉన్న టీవీకే పార్టీ తప్పుపట్టింది. వీటిని తప్పికొట్టింది. ఎదురుదాడికీ దిగింది.
సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పరిశ్రమల తరలింపుపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు చంద్రబాబు బదులిస్తూ "మీకు (తమిళనాడు) మసాలా కావాలి, నాకు ఫలితాలు కావాలి.." అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. పెట్టుబడిదారులు ఎప్పుడూ కూడా తమకు అనుకూలమైన ప్రాంతాలనే ఎంచుకుంటారని అన్నారు. ఈ విషయంలో రాష్ట్రాల మధ్య పోటీ సహజమేనని పేర్కొన్నారు.

పారిశ్రామిక అభివృద్ధి ప్రారంభ దశలో రాయితీలు ఇవ్వడం ఏ ప్రభుత్వానికి అయినా అవసరమని చంద్రబాబు అన్నారు. పారిశ్రామిక పునాది బలపడే కొద్దీ వాటిని తగ్గించడం తమ ప్రభుత్వ వ్యూహమని ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు. తాము అమలు చేస్తోన్న పారిశ్రామిక విధానాలకు పెట్టుబడిదారులు ఆకర్షితులవుతున్నారని, లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టడానికి మొగ్గు చూపుతున్నారని ఆయన చెప్పారు.
చంద్రబాబు చేసిన మసాలా వ్యాఖ్యలపై టీవీకే ఘాటుగా స్పందించింది. అభ్యంతరం వ్యక్తం చేసింది. టీవీకే అధికార ప్రతినిధి, సీనియర్ అడ్వొకేట్ సత్యకుమార్.. దీనిపై స్పందించారు. తమ రాష్ట్ర పారిశ్రామిక వ్యవస్థ అనేది.. నైపుణ్యం కలిగిన మానవ వనరులు, తరతరాల కష్టంపై నిర్మితం అయ్యాయని, వాటిన్నింటినీ "మసాలా" అంటూ తేలిగ్గా తేల్చిచెప్పడం ఏ మాత్రం సరికాదని, చంద్రబాబు హోదాకు తగదని పేర్కొన్నారు.
2027 జనవరిలో దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు నాటికి సాధించే పెట్టుబడులు, కల్పించే ఉద్యోగాల ఆధారంగా ఏ రాష్ట్రం ముందంజలో ఉందో తేల్చుకుందామని సత్యకుమార్ సవాల్ సైతం విసిరారు. తమ రాష్ట్ర ప్రజల ప్రతిభ, ఇక్కడి పారిశ్రామిక పురోగతిని తక్కువ చేసి మాట్లాడటం సరికాదని అన్నారు. తాము సాధించిన పురోగతి ఆర్భాటం కాదని, అనేక తరాలుగా నిర్మించుకున్న బలమైన పారిశ్రామిక పునాదులపై ఆధారపడి ఉందని స్పష్టం చేశారు.
నాణ్యమైన విద్యా వ్యవస్థ, సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, వ్యాపార అనుకూల వాతావరణం రాష్ట్ర ప్రగతికి ప్రధాన మూలస్తంభాలని సత్యకుమార్ వివరించారు. తమిళ ఆత్మగౌరవం, రాష్ట్ర స్వయం ప్రతిపత్తి, సమాఖ్య స్ఫూర్తి అనేవి రాష్ట్ర నిజమైన బలాలు అని గుర్తుచేశారు. విజయ్ నాయకత్వంలో తమిళనాడు వేగంగా అభివృద్ధి సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాలతో నాణ్యమైన ఉద్యోగాల కల్పన, విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
Respected Hon’ble Chief Minister of Andhra Pradesh, Shri Chandrababu Naidu Garu, @ncbn, & @naralokesh Garu.Tamil Nadu will become No.1 State in attracting Investment in India soon. This is our resolve: we will uphold our principles, compete with determination, attract global investment and create quality jobs. Tamil Nadu’s achievements will speak for themselves.We are always Ready for the Challenge ! We will compete with Andhra Pradesh but never enter into alliance with BJP,We will stand firm on our ideological foundations: Secular Social justice, federalism, State autonomy, self-respect, Tamil pride and Tamil identity.Your remark suggesting that Tamil Nadu wants “masala” is unacceptable. Our State’s progress rests on generations of investment in education, knowledge, technology and industrial capability. These achievements deserve respect.The revered founder of the Telugu Desam Party (TDP) Shri Nandamuri Taraka Rama Rao, shared a deep professional association with Madras, where his illustrious cinema career flourished. His legacy reminds us of the enduring cultural connections between our people. Those connections deserve to be honoured. TDP founder Respected NTR’s political inspiration also comes from Revered Puratchi Thalaivar Dr. MGR. Shri. NTR’s foundational success in career comes from Tamil Nadu. Now you have chosen a politically convenient alliance with the BJP. Whatever advantages that partnership may bring, TVK’s ideological opposition to the BJP remains unequivocal. Our pursuit of investment goes hand in hand with our commitment to our principles and the dignity of our State.Tamil Nadu’s educational institutions have welcomed students from Andhra Pradesh and helped many build successful careers by studying in top Technology, Science, Arts educational institutions . We value their contributions and the bonds they have built here. This shared educational legacy deserves acknowledgement and respect.The expansion of educational opportunity in Tamil Nadu owes much to the social reform tradition advanced by Thanthai Periyar and Arignar Anna. Their emphasis on dignity, equality and access to education continues to guide our aspirations and TVK Government.From manufacturing and information technology to scientific research and emerging opportunities in artificial intelligence, Tamil Nadu has the talent, institutions and ambition to compete globally.Under the leadership of Hon’ble Chief Minister Thalapathy Vijay, our commitment is clear: Periyar’s self-respect, Anna’s vision of State autonomy, Tamil pride and identity, and the wisdom of the Tirukkural must find expression in governance.Our people have built Tamil Nadu’s industrial strength through their skills, enterprise and hard work. We will turn your remark into a stronger resolve to attract investment, implement projects and create quality jobs.With our Chief Minister’s anticipated participation in the World Economic Forum at Davos, Switzerland, in January 2027, let us take this competition to the global stage.Let us compete on investments secured, projects implemented and jobs created. Let the benefits delivered to our people determine the outcome.“எண்ணிய எண்ணியாங்கு எய்துப எண்ணியார்திண்ணியர் ஆகப் பெறின்.”- திருக்குறள் 666“Those who pursue their goals with unwavering resolve can achieve what they envision”We will stand by our principles. We will compete with confidence. We will let Tamil Nadu’s achievements speak.In Service Adv. CA. Dr. M. Sathya Kumar LLM, ACA, ACMA, ACS, CIMA - ACMA (UK), CGMA (US), CISI - ACSI (UK), MA (Economics), Ph.D., Advocate - Supreme Court | High Courts | Tribunals TVK National Spokesperson, Key Member, TVK Election Manifesto CommitteeKey Member, TVK Legal Team.@CMOTamilnadu @TVKVijayHQ @TVKPartyHQ @TVKHQITWingOffl @TVKWarriorHQFan @BussyAnand
— TVKAdvocate_SathyaKumar (@TVKSathyaKumar) November 14, 2026
బీజేపీతో ఉన్న రాజకీయ పొత్తులు తాత్కాలికంగా కొన్ని ప్రయోజనాలను ఇచ్చే అవకాశం ఉందే తప్ప ఒక రాష్ట్ర శాశ్వత అభివృద్ధి అక్కడ ఉన్న ప్రజల నైపుణ్యాలు, ప్రభుత్వ పాలనా సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటుందని సత్యకుమార్ వ్యాఖ్యానించారు. మాటలకే పరిమితం కాకుండా, ఆకర్షించిన పెట్టుబడులు, విజయవంతంగా అమలు చేసిన ప్రాజెక్టులు, కొత్తగా సృష్టించిన ఉపాధి అవకాశాల ప్రాతిపదికన రెండు రాష్ట్రాల పనితీరును పోల్చి చూద్దామని ప్రతిపాదించారు.














Click it and Unblock the Notifications
