రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ-మంత్రులకు సీఎం జగన్ శాఖల అంశాలు కేటాయింపు..
రేపు ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా సీఎం జగన్ వద్ద నున్న శాఖల అంశాలపై మంత్రులు స్పందించేందుకు వీలుగా కేటాయింపులు చేశారు.
ఏపీలో రేపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో సీఎం జగన్ చూస్తున్న శాఖలకు సంబంధించిన అంశాల్ని అసెంబ్లీ సమావేశాల్లో సౌలభ్యం కోసం పలువురు మంత్రులకు కేటాయించారు. ఇలా సీఎం జగన్ చూస్తున్న శాఖలకు సంబంధించిన ఐదు అంశాల్ని ఐదుగురు మంత్రులకు కేటాయించారు.
ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్ వద్దనున్న సాధారణ పరిపాలనకు సంబంధించిన అంశాల్ని అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వ్యవసాయమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి కేటాయించారు. అలాగే శాంతి భద్రతలకు సంబంధించి అంశాల్ని హోంమంత్రి తానేటి వనితకు కేటాయించారు.

న్యాయశాఖకు సంబంధించి అంశాల్ని మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కు ఇచ్చారు. ఎన్నారైల సాధికారిత, సంబంధాల అంశాన్ని, ప్రభుత్వ సంస్ధలకు సంబంధించి అంశాల్ని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కు కేటాయించారు.

ఆయా అంశాలపై అసెంబ్లీలో ఆయా మంత్రులు స్పందించాల్సి ఉంటుంది. అలాగే విపక్షాల నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానం చెప్పడంతో పాటు ఆయా శాఖలకు సంబంధించి బిల్లులు కూడా ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంటుంది. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంవో నుంచి అసెంబ్లీ కార్యదర్శికి సమాచారం పంపారు. అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లు చేస్తున్న కార్యదర్శి ఈ అంశాల ఆధారంగా సంబంధిత వ్యవహారాల్ని ఆయా మంత్రులతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications