మళ్లీ దొరికిన చంద్రబాబు- మోతెక్కిన సోషల్ మీడియా..!!

Chandrababu Naidu: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా రాష్ట్రం మోతెక్కిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఆయన జన్మదిన కార్యక్రమాలను వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకొన్నారు. అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో పండగ వాతావరణంలో ఈ వేడుకలు ముగిశాయి.

మంత్రులు, వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. తన బర్త్‌డే సందర్భంగా వైఎస్ జగన్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. చింతపల్లిలో 8వ తరగతి చదివే విద్యార్ధులకు ట్యాబ్లను పంపిణీ చేశారు. వారి మధ్యే పుట్టినరోజు వేడుకలను జరుపుకొన్నారు. భారీ కేక్‌ను కట్ చేశారు.

CM YS Jagan birthday: YSRCP trolling against Chandrababu Naidu for these reason

వైఎస్ జగన్‌‌కు పలువురు ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదలుకుని తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్దలు బర్త్‌డే విషెస్ చెప్పిన వారిలో ఉన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, హీరోలు అక్కినేని నాగార్జున, మహేష్ బాబు ఉన్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సైతం వైఎస్ జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి గౌరవ సూచకం లేకుండా సింగిల్ లైన్‌లో జగన్‌కు విషెస్ తెలిపారు చంద్రబాబు. తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో- Happy birthday అని రాసి, దాన్ని వైఎస్ జగన్‌కు ట్యాగ్ చేశారు.

అదే- ఇప్పుడు కొత్త వివాదాన్ని సృష్టించింది. ప్రధాని మోదీ సైతం జగన్‌కు విషెస్ చెబుతూ చివరన గారు అని గౌరవప్రదంగా సంబోధించారు. జగన్‌కు విషెస్ తెలిపిన వారందరూ కూడా ఇదే రకంగా గారు అని సంబోధిస్తూ ట్వీట్లు పోస్ట్ చేశారు. చంద్రబాబు మాత్రం తన పగను మర్చిపోలేదనిపించేలా ఏకవచనంతో జగన్‌ను సంబోధిస్తూ ట్వీట్ పెట్టడం దుమారం రేపుతోంది.

దీనిపై వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చంద్రబాబును భారీగా ట్రోల్ చేస్తోంది. 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తికి కనీస మర్యాదను కూడా పాటించటం తెలియట్లేదంటూ ధ్వజమెత్తుతోంది. ప్రధాని కంటే చంద్రబాబు ఎక్కువేమీ కాదని మండిపడుతోంది.

చంద్రబాబుతో పాటు తనకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ గారు గౌరవిస్తూ వైఎస్ జగన్ రిప్లై ఇచ్చారని గుర్తు చేశారు. వయస్సులో, రాజకీయాల్లో ఆయన కంటే అనుభవం తక్కువగా ఉన్న ముఖ్యమంత్రిని చూసి నేర్చుకోవాలని హితవు పలుకుతున్నారు. చంద్రబాబుకు కూడా జగన్ ఎంతో గౌరవం ఇచ్చారని పేర్కొన్నారు. చంద్రబాబుకు- జగన్‌కు ఉన్న తేడా ఇదేనని తేల్చి చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+