ఏపీలో ఉద్యోగాల జాతర- గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ల జారీ

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. నిరుద్యోగులకు తీపి కబురు వినిపించింది. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వివిధ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న వందలాది ఉద్యోగాలను భర్తీ చేయడానికి రంగం సిద్ధం చేసింది. త్వరలోనే నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

రెవెన్యూ, రవాణా, వాణిజ్యం, అటవీ, మున్సిపాలిటీలు, దేవాదాయం, రిజిస్ట్రేషన్లు, గృహనిర్మాణం, ఎక్సైజ్, ఆర్థికం.. వంటి శాఖల్లో ఉన్న వేర్వేరు హోదాల్లో గ్రూప్ 1, గ్రూప్ 2 స్థాయి ఖాళీలు ఉన్నాయి. సుమారుగా వెయ్యి వరకు ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వాటన్నింటినీ ఒకేసారి భర్తీ చేయడానికి ఏర్పాట్లు చేపట్టింది. గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు త్వరలోనే విడుదల కానున్నాయి.

 CM YS Jagan given nod to issue the APPSCs Group 1 and Group 2 notification

దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతకం చేశారు. గ్రూప్ స్థాయి అధికారుల ఖాళీలను భర్తీ చేయడానికి ఆయన గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఉదయం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో దీనిపై సమీక్ష నిర్వహించారు వైఎస్ జగన్. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు ఆయా పోస్టుల భర్తీ వివరాలు జగన్‌కు అందజేశారు.

ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వాటిని యుద్ధ ప్రాతిపదిక భర్తీ చేయాలంటూ అధికార యంత్రాంగానికి జగన్ ఆదేశించారు. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ తక్షణమే చేపట్టాలని సూచించారు. సమీక్ష ముగిసిన అనంతరం- అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. వివిధ శాఖలు, విభాగాల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకున్నామని వెల్లడించారు. నోటిఫికేషన్‌ జారీకి అవసరమైన కసరత్తు తుదిదశలో ఉందని వివరించారు.

గ్రూప్‌ 1కు సంబంధించి సుమారు 100కు పైగా ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. గ్రూప్‌ 2లో 900కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. మొత్తంగా 1000కి పైగా ఖాళీలను భర్తీ చేయనున్నామని స్పష్టం చేశారు. వీలైనంత త్వరలో దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ జారీచేయాలని వైఎస్ జగన్ ఆదేశించినట్లు తెలిపారు. త్వరలోనే ఈ ప్రక్రియ చేపడతామని అన్నారు.

గ్రూప్ 1 కేటగిరీలో రీజినల్ ట్రాన్స్‌ఫోర్ట్ ఆఫీసర్, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, డిప్యూటీ ఫారెస్ట్ ఆఫీసర్, గ్రేడ్ 1 మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవీఓ ఖాళీలు ఉంటాయి. గ్రూప్ 2 కేటగిరీలో డిప్యూటీ తహశీల్దార్లు, సబ్- రిజిస్ట్రార్లు, గ్రేడ్ 2 మున్సిపల్ కమిషనర్లు, ట్రెజరీ ఆఫీసర్ల ఖాళీలు ఉంటాయి. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వాటిని భర్తీ చేయనుంది జగన్ ప్రభుత్వం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+