చంద్రముఖి నిద్ర లేస్తుంది.. బాలకృష్ణ ఇలాకాలో చంద్రబాబుపై విరుచుకుపడ్డ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో దూకుడుగా ప్రచార పర్వాన్ని సాగిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థి పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబును ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారు. ఇక తాజాగా హిందూపురంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి మీ బిడ్డ ఆశీస్సుల కోసం మరోసారి మీ ముందుకు వచ్చాడని, ఇచ్చిన అన్ని హామీలను 59 నెలల కాలంలో పూర్తి చేశామని తెలిపారు.
మీ భవిష్యత్ ను నిర్ణయించే ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో తొమ్మిది రోజుల్లో ఎన్నికల కురుక్షేత్ర యుద్ధం జరుగుతోందని, ఈ ఎన్నికలు మీ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని అన్నారు. ఇవి కేవలం ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎంచుకునే ఎన్నికలు మాత్రం కాదని ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయని, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసిపికి ఓటేయాలి అన్నారు.

ఆయనకు ఓటేస్తే అనకొండ నోట్లో తల పెట్టినట్టే
పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే అనకొండ నోట్లో తల పెట్టినట్టేనని జగన్ వెల్లడించారు. చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖి మళ్ళీ నిద్ర లేస్తుంది అని తెలిపారు. 14 సంవత్సరాలు సీఎం గా ఉన్న చంద్రబాబు రాష్ట్ర ప్రజల ఒక హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. వైసిపి హయాంలో ఇచ్చిన పథకాలను ప్రజలకు వివరించి చెప్పారు. దేవుడి దయతో, ప్రజలు చల్లని దీవెనలతో రాష్ట్రంలో ఎన్నడూ జరగని అభివృద్ధిని చేసి చూపించామని జగన్ వెల్లడించారు.
ప్రజలకు ఆసక్తికర అంశం చెప్పిన జగన్
మంచి చేసిన ఫ్యాన్ ఇంట్లో ఉండాలని, చెడు చేసిన సైకిల్ ఇంటి బయట ఉండాలని, ఇక తాగేసిన గ్లాసు సింక్లో ఉండాలని జగన్ అన్నారు. హిందూపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బిసి కులానికి చెందిన దీపిక, ఎంపీ అభ్యర్థిగా బోయ శాంత నిలుస్తున్నారని ఓటేసి గెలిపించాలని కోరారు.
అవ్వ తాతలను ఇబ్బంది పెట్టిన ఘనుడు చంద్రబాబు
దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు అసలు మనిషేనా అని ప్రశ్నించిన జగన్, ఏపీలో పెన్షన్ల విషయంలో అవ్వ తాతలను ఇబ్బంది పెట్టిన ఘనుడు చంద్రబాబు అన్నారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇంటికి రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఇప్పుడు అవ్వా తాతలు తిట్టుకుంటుంటే , ఆ నెపాన్ని వైసీపీపై మోపే ప్రయత్నం చేస్తున్నారని జగన్ ఆరోపించారు.
బాలయ్య ఇలాకాలో చంద్రబాబుపై నిప్పులు చెరిగిన జగన్
తమ హయాంలో అమ్మ ఒడి, వైయస్సార్ చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఇళ్ళ పట్టాలు, ఉచిత భీమా, రైతు భరోసా, ఆసరా, ఇన్పుట్ సబ్సిడీ, పగటిపూట తొమ్మిది గంటల ఉచిత కరెంటు వంటివి ఇచ్చామని.. ఇవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో ప్రజలకు చేసిన ఒక్క మంచి చెప్పాలని నిలదీశారు. బాలయ్య ఇలాకాలో చంద్రబాబు పైన వైయస్ జగన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
-
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
షాకింగ్ : పెళ్లిపై ఏపీ యువత అనాసక్తి .. గణాంకాలు ఏం చెప్తున్నాయంటే -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!!












Click it and Unblock the Notifications