రాజశ్యామల యాగంలో పాల్గొన్న జగన్
YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో పర్యటించారు. చినముషిడివాడలో గల విశాఖ శారదాపీఠం వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. శ్రీ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతితో కలిసి రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం శారదాపీఠంలో రాజశ్యామల యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
శ్రీశారదా పీఠం వార్షిక మహోత్సవాల్లో పాల్గొనడానికి వైఎస్ జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బయల్దేరి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విశాఖకు బయలుదేరి వెళ్లారు. విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చినముషిడివాడలోని శ్రీశారదా పీఠానికి చేరుకున్నారు.

పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి, మంత్రి బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్, వైసీపీకి చెందిన విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ అడారి ఆనంద్ కుమార్.. ఆయనకు సాదర స్వాగతం పలికారు.
అనంతరం రాజశ్యామల యాగం పూర్ణాహూతి కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజశ్యామల అమ్మవారు, వన దుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. దాదాపు గంట పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో జగన్ భాగస్వామ్యులు అయ్యారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి రాజశ్యామల అమ్మవారి ప్రసాదాలను జగన్‌కు అందజేశారు.
విశాఖ శారదా పీఠంలో వార్షికోత్సవ వేడుకలు.
— YSR Congress Party (@YSRCParty) February 21, 2024
సీఎం @ysjagan గారికి సాదర స్వాగతం పలికిన ప్రజాప్రతినిధులు. #CMYSJagan #AndhraPradesh pic.twitter.com/MSrkONWAs8
శ్రీశారదా పీఠం వార్షికోత్సవ వేడుకలకు వైఎస్ జగన్ క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. గత ఏడాది కూడా వైఎస్ జగన్ ఈ వేడుకల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడూ ఆయన ఈ పీఠాన్ని తరచూ సందర్శిస్తుండే వారు.












Click it and Unblock the Notifications