మహిళలకు ఇంటి స్థలాల పై సీఎం జగన్ కీలక ప్రకటన..!!
ముఖ్యమంత్రి జగన్ మంగళగిరిలో కీలక ప్రకటన చేసారు. మహిళలకు ఇంటి పట్టాల పంపిణీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు, లోకేష్ బీసీల నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారని విమర్శించారు. చేనేత వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గంతో ఆ వర్గానికే తాను సీటు ఇచ్చానని చెప్పుకొచ్చారు. మోస పూరిత హామీలు తాను ఇవ్వనని..చేసేదే చెబుతానని స్పష్టం చేసారు. నేతన్నల కోసం తన హాయంలో రూ 3 వేల కోట్లు ఖర్చు చేసామని జగన్ వెల్లడించారు.
బీసీ సీటులో లోకేష్ పోటీ
నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో జగన్ చేనేత వర్గాలతో సమావేశమయ్యారు. మంగళగిరిలో చేనేతలు ఎక్కువగా ఉన్నారని ఆర్కేతో మాట్లాడి ఇక్కడ సీటు చేనేత సామాజిక వర్గానికి చెందిన మహిళకు(లావణ్య) ఇచ్చామని చెప్పారు. కుప్పం, మంగళగిరి రెండు బీసీ సీట్లు అయితే అక్కడ చంద్రబాబు, లోకేష్ పోటీ చేస్తున్నారన్నారు.

గతంలో ఎన్నడూ లేనంతగా ఆ ప్రభుత్వంలో నేతన్నల కోసం 3 వేల కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేశామని చెప్పారు. 2014 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చలేదన్నారు. చంద్రబాబు తన హయాంలో ఒక్కరికైనా సెంట్ స్థలం ఇచ్చారా?.. పక్కా ఇంటిని కట్టించి ఇచ్చారా అంటూ జగన్ ప్రశ్నించారు.
వివక్ష లేని పాలన
వైసీపీ పాలనలో వివక్ష లేకుండా, పార్టీలు చూడకుండా సంక్షేమం అందిస్తున్నామని వివరించారు. 14 ఏళ్లుగా సీఎం చేశానని చంద్రబాబు చెప్పుకుంటారని..తాను ఆయనన్ని సార్లు సీఎంగా పని చేయకున్నా.. ఆయనంత నెగిటివిటీ అనుభవం మాత్రం లేదని జగన్ వ్యాఖ్యానించారు. కోట్లాది రూపాయాలతో మంగళగిరిలో గెలవాలని ప్రయత్నిస్తున్నారని...డబ్బులు తీసుకోండి..ఓటు వేసే సమయంలో మాత్రం పథకాలు ఎవరు ఇస్తారనేది గుర్తించి వేయాలని కోరారు.
ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా లేకుంటే మళ్లీ మోసపోతామని సూచించారు. రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్న చంద్రబాబు విషయం జాగ్రత్తగా ఉండాలన్నారు. సూపర్ సిక్స్, సెవెన్ అంటూ వస్తున్న చంద్రబాబు గతంలో చేసిన అన్యాయాన్ని గుర్తుచేసుకోవాలని సూచించారు.
గుంటూరు జిల్లా, మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్ లో చేనేత కార్మికులతో ముఖాముఖి! Memantha Siddham Yatra, Day-14. #MemanthaSiddham #YSJaganAgain #VoteForFan https://t.co/9tDW5EaBOx
— YSR Congress Party (@YSRCParty) April 13, 2024
బీసీలకు ప్రాధాన్యత
50 శాతం వెనుకబడిన వర్గాలకు టికెట్ ఇచ్చిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. దేశ రాజకీయ చరిత్రలోనే ఇది ఒక రికార్డుగా పేర్కొన్నారు. మంగళగిరిలో లక్షా 20వేల ఇళ్లున్నాయి. లక్షా 8వేల ఇళ్లకు నేరుగా సంక్షేమ పథకాలు అందించాం. 90 శాతం ఇళ్లకు లంచాలకు తావులేకుండా లబ్ధి జరిగింది. నేరుగా వారి ఖాతాల్లోనే నగదు జమ చేసిన ప్రభుత్వం అని తెలిపారు.
మంగళగిరిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే చంద్రబాబు అడ్డుకున్నాడు. కోర్టులకు వెళ్లి పిటిషన్లు వేసి చంద్రబాబు అడ్డుకున్నాడు. మీ ఇళ్ల పట్టాలు అడ్డుకున్నది చంద్రబాబే. అందుకే ఓటు వేయమని అడిగినప్పుడు చంద్రబాబును నిలదీయాలని ముఖ్యమంత్రి జగన్ కోరారు.












Click it and Unblock the Notifications