గుంటూరులో బీటెక్ విద్యార్థిని హత్యపై సీఎం జగన్ రియాక్షన్.. బాధితురాలి కుటుంబానికి రూ.10లక్షలు...
గుంటూరు జిల్లా కాకాణిలో బీటెక్ విద్యార్థిని దారుణ హత్యపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. 'ఈరోజు గుంటూరుజిల్లా కాకాణిలో జరిగిన దుర్ఘటన ఎంతో దురదృష్టకరం. విద్యార్థిని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. ఈ ఘటనపై దర్యాప్తు వేగవంతం చేసి, బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలని ఆదేశిస్తున్నాను. ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది.' అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
మృతురాలి కుటుంబానికి సీఎం జగన్ రూ.10లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. యువతి హత్య ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని, నిందితుడికి కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

గుంటూరులోని కాకాణి రోడ్డు పరామయకుంటలో ఆదివారం(ఆగస్టు 15) ఉదయం 10గంటల సమయంలో నల్లపు రమ్య అనే బీటెక్ విద్యార్థిని హత్యకు గురైన సంగతి తెలిసిందే.ఇంటి నుంచి సమీపంలోని ఓ షాపుకు వెళ్లిన సమయంలో... ఓ యువకుడు అక్కడికి వచ్చి ఆమెతో గొడవపడినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా కత్తితో అతను దాడి చేసి పరారయ్యాడు. విచక్షణారహితంగా దాడి చేయడంతో రమ్య అక్కడికక్కడే కుప్పకూలింది. స్థానికులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. రమ్య శరీరంపై ఆరు కత్తిపోట్లను గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
మృతురాలి తండ్రి,సోదరుడు ఆస్పత్రి వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతురాలి తల్లి రమ్య మృతదేహంపై పడి గుండెలవిసేలా రోధించారు. మృతురాలి తండ్రి మాట్లాడుతూ... హత్య జరిగిన సమయంలో తాను వేరే గ్రామంలో ఉన్నట్లు చెప్పారు. ఎందుకు జరిగిందో,ఎలా జరిగిందో తనకేమీ తెలియదన్నారు. తమకు ఎవరి పైనా అనుమానం లేదన్నారు. సెయింట్ మేరీస్ కాలేజీలో తన కూతురు బీటెక్ మూడో సంవత్సరం చదువుతోందని చెప్పారు.
గుంటూరు జీజీహెచ్‌లో మృతురాలు రమ్య మృతదేహాన్ని హోంమంత్రి మేకతోటి సుచరిత పరిశీలించారు. బీటెక్ విద్యార్థిని రమ్య హత్య ఘటన ఎంతో బాధాకరమని వ్యాఖ్యానించారు.మృతురాలి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇప్పటికే హత్యకు సంబంధించి పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించారని... సాధ్యమైనంత త్వరగా పోలీసులు నిందితుడిని పట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారని చెప్పారు.
రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ జీజీహెచ్‌లో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అందరూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఉన్న సమయంలో గుంటూరు నడిరోడ్డులో పట్టపగలు జరిగిన ఈ ఘటన ఒక మాయని మచ్చ అని వాసిరెడ్డి పద్మ అన్నారు.పోలీసులు సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారని... నిందితులకు కఠిన శిక్ష విధించాలని అన్నారు.
ఈరోజు గుంటూరుజిల్లా కాకాణిలో జరిగిన దుర్ఘటన ఎంతో దురదృష్టకరం. విద్యార్థిని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. ఈ ఘటనపై దర్యాప్తు వేగవంతం చేసి, బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలని ఆదేశిస్తున్నాను. ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది.
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 15, 2021
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications