రాజశ్యామల యాగంలో జగన్

YS Jagan: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెెడ్డి.. రాజశ్యామల యాగానికి హాజరు కానున్నారు. విశాఖ శ్రీ శారదా పీఠం వేదికగా అయిదు రోజుల పాటు జరగబోయే ఈ ఉత్పవాల్లో పాల్గొననున్నారు.

చినముషిడివాడలో గల విశాఖ శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలు ప్రతి సంవత్సరం ఏర్పాటవుతుంటాయనే విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా వీటిని అంగరంగ వైభవంగా జరుగనుంది. దీని కోసం ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ నెల 15వ తేదీన చండీ యాగంతో ఈ వేడుకలు మొదలవుతాయి. 19వ తేదీన రాజశ్యామల యాగంతో ముగుస్తాయి.

CM YS Jagan to take part in annual celebrations of Visakha Sarada Peetham

ముగింపు కార్యక్రమానికి వైఎస్ జగన్ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. సాయంత్రం వరకూ ఆశ్రమంలోనే గడుపుతారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి పర్యవేక్షణలో జరిగే రాజశ్యామల యాగంలో భాగస్వామ్యులవుతారు. లలితాంబికా అమ్మవారిని సందర్శిస్తారు. గోపూజ, శమీవృక్ష పూజల్లో పాల్గొంటారు.

ఈ ఉత్సవాల కోసం వైఎస్ జగన్‌కు ఆహ్వానపత్రం అందింది. కొద్దిసేపటి కిందటే- శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స‌రస్వ‌తి స్వామి ఆయనను కలిశారు. తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో జగన్‌ను మ‌ర్యాద‌పూరకంగా క‌లిశారు. ఈ నెల 15 నుంచి 19వ తేదీ వ‌ర‌కు జ‌రిగే వార్షికోత్స‌వాల‌కు రావాల్సిందిగా ఆహ్వాన‌ప‌త్రిక అంద‌జేశారు.

ఈ సందర్భంగా స్వాత్మానందేంద్ర స్వామి రాజశ్యామల అమ్మవారి ప్రసాదాలను జగన్‌కు అందజేశారు. శేషవస్త్రాన్ని కప్పారు. గత ఏడాది కూడా వైఎస్ జగన్ ఈ వేడుకల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడూ ఆయన ఈ పీఠాన్ని తరచూ సందర్శిస్తుండే వారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+