ముంపు గ్రామాల పర్యటనకు జగన్- ఆ మండలంలో బాధితులతో భేటీ
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలను అతి భారీ వణికించాయి. అన్ని జిల్లాల్లోనూ ఏకధాటిగా వర్షాలు పడ్డాయి. ఫలితంగా- వాగులు, వంకలు పొంగి పొర్లాయి. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుసిన వర్షాల వల్ల అటు గోదావరి నది వరదనీటితో పోటెత్తింది. భద్రాచలం వద్ద వరద ప్రవాహం దాదాపుగా 48 అడుగులుగా నమోదైంది.
గోదావరి పరీవాహక ప్రాంతం, రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న అనేక ఏజెన్సీ గ్రామాలు నీట మునిగాయి. దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, కూనవరం.. వంటి మండలాలకు వెళ్లే రహదారులపై వరదనీరు చేరుకోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో భారీగా పెరగడం వల్ల లక్షల క్యూసెక్కులకు వరదనీటిని దిగువకు వదిలివేశారు అధికారులు.

గోదావరి నదికి పోటెత్తిన వరద ప్రభావం అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, ఏలూరు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 42 మండలాలపై పడింది. ఆయా మండలాల పరిధిలో ఉన్న 458 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. పలు లంక గ్రామల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయా గ్రామాల్లో పర్యటించనున్నారు. వరద బాధితులను ముఖాముఖిగా కలుసుకోనున్నారు. ప్రధానంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలాన్ని ఆయన సందర్శించనున్నారు. ఈ మండలం పరిధిలోని గ్రామాల ప్రజలను జగన్ నేరుగా కలుసుకుని అక్కడి పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు.

రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఆ శాఖ ఉన్నతాధికారులు, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ముఖ్యమంత్రి వెంట రానున్నారు. అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల కలెక్టర్లు ఆయన వెంట ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తారు.
-
జగన్ ను సీఎం చేసేందుకు సంతకం పెట్టా.. కానీ ! కన్నా షాకింగ్..! -
టీడీపీ ఎంపీకి జగన్ బిగ్ ఆఫర్ - మారుతున్న లెక్కలు..!? -
YS Sharmila : "అవి గొడ్డలి"- జగన్ మావిగాన్ కు షర్మిల షాకింగ్ పంచ్..! -
పాదయాత్ర 2.0 పై మారిన జగన్ ఆలోచన, పార్టీ ప్లీనరీ అక్కడే..!! -
జగన్ పై అటాక్ కు కాదేదీ అనర్హం ? తండ్రి పాదయాత్రనూ వాడేస్తున్న షర్మిల..! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న












Click it and Unblock the Notifications