ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జగన్.. విశాఖలో

YS Jagan: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెెడ్డి.. రాజశ్యామల యాగానికి హాజరు కానున్నారు. విశాఖ శ్రీ శారదా పీఠం వేదికగా అయిదు రోజుల పాటు జరగబోయే ఈ ఉత్పవాల్లో పాల్గొననున్నారు.

చినముషిడివాడలో గల విశాఖ శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలు ప్రతి సంవత్సరం ఏర్పాటవుతుంటాయనే విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా వీటిని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 21వ తేదీన రాజశ్యామల యాగంతో శారదా పీఠం వార్షికోత్సవాలు ముగుస్తాయి.

CM YS Jagan to visit Visakhapatnam on Feb 21

ముగింపు కార్యక్రమానికి వైఎస్ జగన్ హాజరు కానున్నారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి పర్యవేక్షణలో జరిగే రాజశ్యామల యాగంలో భాగస్వామ్యులవుతారు. లలితాంబికా అమ్మవారిని సందర్శిస్తారు. గోపూజ, శమీవృక్ష పూజల్లో పాల్గొంటారు.

ఈ ఉత్సవాలకు హాజరు కావాలంటూ ఇదివరకే వైఎస్ జగన్‌కు ఆహ్వానపత్రం అందింది. ఇటీవలే శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స‌రస్వ‌తి స్వామి ఆయనను కలిశారు. శారదాపీఠం వార్షికోత్స‌వాల‌కు రావాల్సిందిగా ఆహ్వాన‌ప‌త్రిక అంద‌జేశారు. గత ఏడాది కూడా వైఎస్ జగన్ ఈ వేడుకల్లో పాల్గొన్న విషయం తెలిసిందే.

CM YS Jagan to visit Visakhapatnam on Feb 21

ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి రోడ్డు మార్గంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు జగన్. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నానికి వెళ్తారు. అనంతరం చినముషిడివాడ చేరుకుంటారు. శారదా పీఠంలో రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేస్తారు. మధ్యాహ్నం తాడేపల్లి తిరిగి వస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+