20న ఇంద్రకీలాద్రికి వైఎస్ జగన్

విజయవాడ: దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారి ఆలయాన్నీ భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శంచుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు.

దసరా అనగానే- ఏపీలో అందరికీ గుర్తుకొచ్చే పేరు విజయవాడ. ఇక్కడి ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో దసరా నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. దసరా రోజుల్లో కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం లక్షలాదిమంది భక్తులు విజయవాడకు చేరుకుంటుంటారు.

CM YS Jagan visits Kanaka Durga temple and offer silk robes during the Dussehra on Oct 20

ఈ నవరాత్రుల సందర్భంగా రోజుకో అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తుంటారు. దసరా ఉత్సవాలకు అంకురార్పణ జరిగినప్పి నుంచి ఇప్పటివరకు సుమారు రెండు లక్షల మంది వరకు కనకదర్గమ్మను దర్శించినట్లు అంచనా వేస్తోన్నారు. నవరాత్రులు ముగిసేసరికి ఈ 7 నుంచి 8 లక్షల వరకు పెరగొచ్చు.

ఈ క్రమంలో- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 20వ తేదీన మూలానక్షత్రం నాడు కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోనున్నారు. పట్టువస్త్రాలను సమర్పిస్తారు. ఆ ఒక్కరోజే లక్షన్నర మందికి పైగా భక్తులు అమ్మోరిని దర్శించే అవకాశం ఉందని ఆలయ అధికారులు చెబుతున్నారు. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకుంటోన్నారు.

భక్తుల కోసం అదనపు క్యూలైన్లను ఏర్పాటు చేయనున్నారు. తీర్థ ప్రసాదాలను అందుబాటులో ఉంచనున్నారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు అన్నదానం ఏర్పాట్లను సిద్ధం చేయనున్నారు. వీటిని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పరిశీలించారు. అధికారులకు తగిన సూచనలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+