ఒకేరోజు అటు కడప..ఇటు విశాఖ: వైఎస్ జగన్ బిజీ షెడ్యూల్
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవ్వాళ ఒకేరోజు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. తన సొంత జిల్లా కడపతో పాటు విశాఖపట్నానికి ఆయన బయలుదేరి వెళ్లనున్నారు. ఉదయం కడప.. సాయంత్రం విశాఖపట్నంలో వేర్వేరు కార్యక్రమాలకు హాజరు కానున్నారు. ఈ రోజంతా ఈ రెండు జిల్లాల పర్యటనతో గడపనున్నారు. ఈ సాయంత్రం విశాఖపట్నానికి రానున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ముఖ్యమంత్రి స్వాగతం పలుకుతారు.
ఈ ఉదయం ఆయన కడపకు బయలుదేరి వెళ్లనున్నారు. ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా కుమార్తె వివాహానికి హాజరు కానున్నారు. వధూవరులను ఆశీర్వదించనున్నారు. ఉదయం 9:30 గంటలకు వైఎస్ జగన్- తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరి వెళ్తారు. 9:50 నిమిషాలకు విమానాశ్రయానికి చేరుకుంటారు. 10 గంటలకు ప్రత్యేక విమానంలో కడపకు బయలుదేరుతారు. 10.45 నిమిషాలకు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు.

11 గంటలకు కడప విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో రిమ్స్‌కు చేరుకుంటారు. 11:105 నిమిషాలకు రిమ్స్ నుంచి రింగ్ రోడ్‌లో గల పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇన్‌స్టిట్యూట్‌కు చేరుకుంటారు. ఈ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభిస్తారు. 11:40 నిమిషాల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అనంతరం పుష్పగిరి ఇన్‌స్టిట్యూట్ నుంచి బయలుదేరి జయరాజ్ గార్డెన్స్‌కు చేరుకుంటారు. ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా కుమార్తె వివాహానికి హాజరవుతారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12:10కి మళ్లీ తాడేపల్లికి తిరుగుప్రయాణం అవుతారు. 1:40 నిమిషాలకు క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు.
Recommended Video
మళ్లీ మధ్యాహ్నం 3:40 నిమిషాలకు ఆయన విశాఖ పర్యటన ఆరంభమౌతుంది. సాయంత్రం 4:50 నిమిషాలకు వైఎస్ జగన్ విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు. వీవీఐపీ లాంజ్‌లో పార్టీ నాయకులతో కొద్దిసేపు సమావేశమౌతారు. 5 గంటలకు నావల్ ఎయిర్ స్టేషన్‌కు చేరుకుంటారు. 5:20 నిమిషాలకు విశాఖ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఆయన స్వాగతం పలుకుతారు. 5:30 నిమిషాలకు మళ్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని, తాడేపల్లికి బయలుదేరి వెళ్తారు.
-
విశాఖ-చర్లపల్లి ఎక్స్ ప్రెస్ లో కీలక మార్పు-ఇకపై ఇలా..! -
నేటి నుంచి ఒంటమిట్ట రాములోరి ఆలయంలో.. !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications