తీవ్ర వాయుగుండంగా అర్నబ్‌.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ..

అర్నబ్ తుఫాను నేపథ్యంలో అనుక్షణం అప్రమత్తత, అత్యున్నత సన్నద్దత, ముందస్తు ప్రణాళికతో అన్ని స్థాయిల్లో యంత్రాంగం పని చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న వాతావరణ శాఖ సమాచారం నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించాలి. ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలి అని ఆదేశించారు. జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసుకుని ప్రజలకు అవసరమైన సూచనలు చేయాలని ఆదేశించారు. ఎక్కడా ప్రాణ నష్టం జరగకూడదు.. ఆస్తి నష్టం సాధ్యమైనంత తగ్గించాలని సీఎం సూచించారు. ప్రజల ఫోన్లకు నిరంతరం సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయండి.. ప్రభుత్వ సూచనలు పాటించేలా తీర ప్రాంతాల్లో గ్రామాల ప్రజలను ఒప్పించండి అని సీఎం చంద్రబాబు సూచించారు. శాటిలైట్ల సమాచారంతో, సైంటిఫిక్ డేటా ఆధారంగా చర్యలు తీసుకోవాలి అన్నారు.

గర్భిణీలను ముందే ఆసుపత్రులకు తరలించాలి

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... 'తుఫాను వల్ల గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. విద్యుత్ శాఖ పూర్తి సన్నద్దతతో ఉండి విద్యుత్ పునరుద్దరణ వేగంగా జరిగేలా చూడాలి. సముద్రంపై వేటకు వెళ్లిన అన్ని బోట్లు తీరానికి వచ్చేలా చూడాలి. భారీ వర్షాలతో వచ్చే వరదతో నీటి వనరులను నింపేందుకు అవసరమైన అన్ని చర్యలు ఇరిగేషన్ శాఖ తీసుకోవాలి. జీరో ఇన్సిడెంట్స్ లక్ష్యంగా అన్ని స్థాయిలో ప్రభుత్వ వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాలి. ఒక సారి తుఫాను ప్రభావం మొదలై రాకపోకలకు ఆటంకం కలిగితే గర్భిణీలు ఇబ్బందులు పడతారు. ఈ వారంలో కాన్పులు అయ్యే గర్భిణీలను ముందుగానే ఆసుపత్రికి తరలించాలి. తాగునీరు, ఆహారం పూర్తి స్థాయిలో సిద్దం చేసుకోవాలి. వీటికి నిధుల కొరత లేకుండా కలెక్టర్లు చూసుకోవాలి. పునరావాస కేంద్రాల్లో వసతులు, సౌకర్యాలు ఉండాలి. తుఫాను ప్రభావిత ప్రాంతం ప్రజల నుంచి చిన్న ఫిర్యాదు కూడా రాకూడదు. సెల్ ఫోన్ నెట్‌వర్క్ దెబ్బతింటే వెంటనే పునరుద్దరించేలా ఏజెన్సీలను సిద్దం చేయాలి. ఈ విషయంలో జాప్యాన్ని సహించవద్దు' అని ఆదేశించారు. సివిల్ సప్లై, మునిసిపల్, పంచాయతీ రాజ్, విద్యుత్, హోం, ఫైర్, వ్యవసాయ శాఖ అధికారులు తుఫాను సన్నద్దత చర్యలను ముఖ్యమంత్రికి వివరించారు.

విశాఖ -బాపట్ల మధ్య 28వ తేదీన తీరం దాటే అవకాశం

బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడే అవకాశం ఉందని అధికారులు వివరించారు. అక్టోబర్‌ 28 మధ్యాహ్నానికి బాపట్ల - విశాఖపట్నం మధ్య తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుత అంచనాల్లో కోనసీమ-యానాం-కాకినాడ తీర ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా సుమారు 850 కిలోమీటర్లు, కాకినాడకు సుమారు 930 కిలోమీటర్ల దూరంలో వాయుగుండంగా ఉంది. అక్టోబర్‌ 26 ఉదయానికి తుఫానుగా, అదే రోజు రాత్రికి తీవ్ర తుఫానుగా, 27న అతి తీవ్ర తుఫానుగా బలపడుతుంది. తీరం దాటే సమయంలో గంటకు 115 - 125 కిలోమీటర్ల వేగంతో గాలులు...కొన్ని సందర్భాల్లో 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది అని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రతి నాలుగు గంటలకు తుఫానుపై బులిటెన్ విడుదల చేయాలని సీఎం సూచించారు.

CMChandrababu directed officials to ensure that the administration remains vigilant Cyclone Arnab

భారీ, అతి భారీ వర్షాలు

అక్టోబర్‌ 27, 28 తేదీల్లో ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రపైనా గాలులు, వర్ష ప్రభావం ఉంటుంది. అనకాపల్లి జిల్లాలో అత్యధికంగా సగటున 292.55 మి.మీ., అల్లూరి సీతారామరాజు జిల్లాలో 281.17 మి.మీ., విశాఖపట్నంలో 253.87 మి.మీ., శ్రీకాకుళంలో 249.18 మి.మీ. వర్షపాతం పడవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు రోజుల సగటు మొత్తం వర్షపాతం 95 మి.మీ. గా ఉంటుందని అంచనా వేయగా.. ప్రభావిత జిల్లాల్లో సగటున 22-29 సెం.మీ వర్షపాతానికి అవకాశం ఉందని అధికారులు వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+