తెలంగాణలో భారీ పరిశ్రమకు కోకకోలా ప్లాన్, కేసీఆర్‌తో..
హైదరాబాద్: ప్రముఖ కూల్ డ్రింక్స్ సంస్థ కోకాకోలా తెలంగాణలో భారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలనే యోచనలో ఉంది. సంస్థ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం సోమవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో భేటీ కానుందని తెలుస్తోంది.
కోకాకోలాకు ప్రస్తుతం తెలంగాణలోని పటాన్ చెరువులో ఒక పరిశ్రమ ఉంది. దానికి నాలుగు రెట్లు భారీ పరిశ్రమను దేశంలో నిర్మించాలని ఈ సంస్థ నిర్ణయించింది. ఈ సంస్థ ఇందుకు తెలంగాణను ఎంచుకున్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ఇందుకోసం కేసీఆర్‌ను కలవనున్నారని తెలుస్తోంది.

దీనికి ప్రతిపాదనలను అమెరికాలోని సంస్థ ప్రతినిధి బృందం రూపొందించింది ఈ బృందం ఆదివారం హైదరాబాదుకు చేరుకుంది. సోమవారం సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశఖర రావును కలిసి పరిశ్రమ గురించి వివరించనుందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications