కోక కోలా నుంచి కొత్తగా లిక్కర్ లెమన్ డౌ
మందుబాబులకు మరో బ్రాండ్ అందుబాటులోకి వచ్చింది. శీతల పానీయాల రంగంలో అగ్రగామిగా ఉన్న కోక కోలా సంస్థ ఇప్పుడు మద్యం తయారీ మార్కెట్ లోకి ప్రవేశించింది. కొత్త లిక్కర్ బ్రాండ్‌ను ప్రజలకు రుచి చూపిస్తోంది. బ్రాండ్ పేరు లెమన్- డౌ (Lemon-Dou). వీటి విక్రయాలను సంస్థ ధ్రువీకరించింది. దేశం మొత్తం అందుబాటులోకి రాలేదు. మహారాష్ట్ర, గోవాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి దేశం మొత్తం విడుదల చేస్తారు. ధరల విషయానికొస్తే.. గోవాలో 250 ml క్యాన్ ధర రూ.150, మహారాష్ట్రలో అదే 250 ml క్యాన్ ధర రూ.230గా నిర్ణయిచారు.
ఇప్పటికే కోక కోలా కంపెనీ ఈ లెమన్ డౌ బ్రాండ్ ను జపాన్, ఫిలిప్పీన్స్, చైనా వంటి దేశాల్లో విక్రయిస్తోంది. భారత్‌లో కూడా ఈ బ్రాండ్ ను పరిచయం చేస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలకు కిక్ ఇస్తున్న ఈ కోక కోలా బ్రాండ్ మద్యం ఇకనుంచి మనదేశంలోని మందు బాబులకు కిక్కివ్వనుంది. ఈ బ్రాండ్ ను విదేశాల్లో మాత్రమే తయారు చేస్తారు. ఆల్కహాల్ మిక్స్ ఇది. వోడ్కా, బ్రాందీ వంటి డిస్టిల్డ్ లిక్కరును వాడతారు. రాబోయే సంవత్సరాల్లో దీని సేల్స్ భారీగా పెరుగుతాయని సంస్థ భావిస్తోంది. ప్రజలు కూడా ఈ కొత్తరకం మద్యంపై చర్చలు పెట్టారు.

ఆల్కహాల్ సేవించడం అనారోగ్యానికి కారణమని ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ మందుబాబులు మాత్రం మద్యం తాగడాన్ని మానడంలేదు. మద్యం తాగేవారికి వారికి తెలియకుండానే అలవాటు మానిపించొచ్చు అంటూ ప్రకటనలు వస్తున్నాయికానీ అవి కూడా పనిచేయడంలేదు. ప్రజల ఆరోగ్యాన్ని కాపడటానికి మద్యం తయారీ ఆపాలి. కానీ ప్రభుత్వానికి వాటిద్వారానే ఆదాయం వస్తోంది. అంటే.. ప్రభుత్వమే రెండు పడవలమీద ప్రయాణం చేస్తోంది. ఈ రెండింటిలో ఒకటి ఎంచుకోమంటే ఏ ప్రభుత్వమైన మద్యం అమ్మకాలనే ఎంచుకుంటుంది. ఎందుకంటే అది సిరులు కురిపిస్తుంది కాబట్టి.












Click it and Unblock the Notifications