• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కమెడియన్ పృధ్వీ కి కీలక పదవినిచ్చిన జగన్ .. పృధ్వీ కే ఎందుకంటే

|
  SVBC ఛానల్ చైర్మన్‌గా కమెడియన్ పృధ్వీ | Prudhvi Likely To Be Appointed As Chairman Of SVBC Channel

  తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా నడిచే భక్తి చానల్ శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ కు చైర్మన్ గా కీలక పదవిని కమెడియన్ పృధ్వీకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు జగన్ . గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి మద్దతు ఇవ్వడమే కాకుండా, పార్టీ కోసం ప్రచారం చేసిన తెలుగు కమెడియన్ పృథ్వికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలకమైన పదవిని అప్పగించారు. తిరుమల శ్రీవారి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటుతున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్‌కు (ఎస్‌వీబీసీ) చైర్మన్‌గా ఆయనను నియమించారు. చాలా పెద్ద కీలక బాధ్యతను ఆయనకు అప్పగించారు.

  టీడీపీ హయాంలో శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్ చైర్మన్‌గా దర్శకుడు రాఘవేంద్రరావు ఉన్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. 2018లో చానల్ చైర్మన్‌గా రాఘవేంద్రరావు నియమితులైన రాఘవేంద్రరావు దేవస్థాన ధర్మకర్తల మండలిలో సభ్యులుగా ఉంటూనే ఆయన ఎస్వీబీసీ చానెల్ బాధ్యతలు కూడా నిర్వహించారు. రాఘవేంద్రరావు రాజీనామా చేసిన తర్వాత చైర్మన్ పదవి ఖాళీ అయింది. ఇక ఆస్థానంలో పృధ్వీ కి ఛాన్స్ దక్కింది.

  Comedian Prithvi got a key post in AP .. Why Jagan gave the chance to Prudhvi

  పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పృథ్వీ తన సొంత జిల్లాలో జగన్ పాదయాత్ర సందర్భంగా వైసీపీలో చేరారు. పృథ్వీ ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మొత్తానికి టాలీవుడ్ నటుడు కమెడియన్ పృథ్వీ జాక్ పాట్ కొట్టినట్టుగా తెలుస్తుంది . వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా పని చేసిన పృథ్వీకి జగన్ ప్రభుత్వం గట్టి బహుమానమే ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

  ప్రస్తుతం టీటీడీ కమిటీ సభ్యులు ఎస్వీబీసీ చైర్మన్ తదితర పోస్టుల భర్తీ మాత్రం పెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో పార్టీకి సినీ ఇండస్ట్రీ నుండి గట్టి సపోర్టర్ గా నిలిచిన పృథ్వీకి ఎస్వీబీసీ చైర్మన్ పదవి దక్కిందని తెలుస్తుంది. వైసీపీ కోసం పని చేసిన జీవితా రాజశేఖర్ , జయసుధ, అలీ , మోహన్ బాబు వంటి ప్రముఖులైన నటీనటులు ఉన్నప్పటికీ మొదటి నుండి వైసీపీ కి , జగన్ కి కట్టుబడి పని చేసినందుకే పృధ్వీకి బంపర్ ఆఫర్ ఇచ్చారని వైసీపీ నేతలు భావిస్తున్నారు. మొత్తానికి పృధ్వీ రొట్టె విరిగి నేతిలో పడిందని చర్చించుకుంటున్నారు సినీ వర్గాలు .

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Popular comedian and senior actor Prudhvi is more likely to be appointed as the Chairman of SVBC channel. The new Andhra Pradesh government i.e YSRCP government led by CM YS Jagan will shortly issue a government order appointing him as chairperson, it is learned. It is well known that thirty industry fame actor Prudhvi has been the main supporter of YS Jagan Mohan Reddy and his party from Tollywood since the very beginning. Earlier, the veteran director K Raghavendra Rao was the chairperson of this devotional channel run by Tirumala Tirupathi Devasthanam (TTD).
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more