చిరంజీవి ప్రజారాజ్యంపై కమెడియన్ సునీల్ షాకింగ్ కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఓ వెలుగు వెలిగారు. ఇండస్ట్రీకి చెందిన హీరోల కొడుకులు వారసులుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ వారిని దాటుకుని మరీ నెంబర్ వన్ స్థానాన్ని చిరంజీవి కైవసం చేసుకున్నారు. దాదాపు 30 ఏళ్లపాటు తెలుగులో టాప్ హీరోగా చిరంజీవి నిలిచారంటే ఆయన స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఒకనొక సమయంలో దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా చిరంజీవి నిలిచారు.
సినిమాల్లో వచ్చిన క్రేజ్‌తో చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అప్పటికే చాలామంది హీరోలు రాజకీయాల్లోకి వచ్చి ఫెయిల్ అవ్వడాన్ని కళ్లరా చూసి కూడా ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2009 సార్వత్రిక ఎన్నికల ముందు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఎన్నో అంచనాల మధ్య పోటీ చేసిన ప్రజారాజ్యం కేవలం 18 సీట్లలో మాత్రమే విజయం సాధించగలిగింది.

ఆ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన చిరంజీవి ఓ చోట ఓడిపోయి, మరో స్థానంలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. చిరంజీవి తన సొంత నియోజకవర్గం పాలకొల్లులో చిరంజీవి ఓడిపోవడం ఆయనకు మాయని మచ్చలా నిలిచింది. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ చరిష్మా ముందు చిరంజీవి నిలబడలేకపోయారు. వైఎస్ఆర్ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం జరిగింది.
వైఎస్ఆర్ హఠాత్తు మరణం తరువాత జరిగిన రాజకీయ పరిణామాలతో చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీను ముందుకు తీసుకువెళ్లలేకపోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో తన ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసి కేంద్రమంత్రి అయ్యారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో చిరంజీవి క్రియశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో చిరంజీవి ఓ ఫెయిల్యుర్ పొలిటిషియన్‌గా నిలిచారు. తాజాగా కమెడియన్ సునీల్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఎందుకు ఫెయిల్ అయిందో వివరించే ప్రయత్నం చేశారు.
చిరంజీవి గారు సినిమాల్లో తన సొంత టాలెంట్‌తో టాప్ హీరోగా ఎదిగారని..కానీ రాజకీయాల్లో అలా కాదని సునీల్ చెప్పుకొచ్చారు. రాజకీయంగా సక్సెస్ కావాలంటే చాలా అంశాలు, చాలా మంది వ్యక్తుల పై ఆధారపడి ఉంటుందని ఆయన తెలిపారు. రాజకీయాల్లో ఆయన చుట్టూ ఉన్న వ్యక్తుల్లో ఒక్కరు రాంగ్ స్టెప్ వేసినా చాలు అంతా.. నాశనం అవుతుందని సునీల్ తెలిపారు. ఆ విధంగా చిరంజీవి చుట్టూ ఉన్నవారు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్లే ప్రజారాజ్యం ఫెయిల్ అందని సునీల్ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications