నాగబాబుకు పిఠాపురం వాసి దిమ్మతిరిగే కౌంటర్
పిఠాపురం.. ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసిన ఈ నియోజకవర్గం గురించే చర్చ సాగుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో పిఠాపురం నియోజకవర్గం ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్ ..వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి చట్టసభల్లో అడుగు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. కూటమి తన గెలుపుకు కలిసి వస్తుందని పవన్ కల్యాణ్ లెక్కలు వేసుకుంటున్నారు. ఇదే సమయంలో అధికార వైసీపీ కూడా మరోసారి పవన్‌ను ఓడించి ఆయనకు రాజకీయంగా చెక్ పెట్టాలని భావిస్తోంది.
పవన్‌ను ఓడించడానికి తమ దగ్గరున్న అన్ని అస్త్రాలను బయటకు తీస్తోంది అధికార పార్టీ. పిఠాపురంలో పవన్‌ని ఓడించేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పిఠాపురంలో గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పిఠాపురంలో గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత పావులు కదుపుతున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. పవన్ నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు హాజరైయ్యారు. ఇదిలా ఉంటే మెగా బ్రదర్ నాగబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

ఆయన తాజాగా మాట్లాడుతూ..పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించడానికి కడప నుంచి అల్లరి మూకలు, రౌడీలను రంగంలోకి దించారని వైసీపీపై నాగబాబు విమర్శలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై పిఠాపురానికి చెందిన ఓ వ్యక్తి కౌంటరిచ్చాడు. సదరు వ్యక్తి మాట్లాడుతూ..పిఠాపురం కడప నుంచి అల్లరి మూకలు, రౌడీలు ఎవరూ రాలేదని..వీళ్లే జబర్థస్త్ ఆర్టిస్టులను రంగంంలోకి దించారని నాగబాబును ఎద్దెవా చేశాడు. హైపర్ ఆదిని చూసి ఒక్కరు కూడా ఓటు వేయరని..స్థానికంగా ఉండే అభ్యర్థిని చూసే ఓట్లు వేస్తారని చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
https://www.facebook.com/reel/309099305552374












Click it and Unblock the Notifications