కమ్యూనిస్టు యోధుడు నర్రా రాఘవరెడ్డి కన్నుమూత

నల్లగొండ: ప్రముఖ కమ్యూనిస్టు నేత, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు నర్రా రాఘవరెడ్డి కన్నుమూశారు. ఆయన వయస్సు 92 ఏళ్లు. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆయనను గురువారంనాడు నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు.

శరీరంలో చక్కెర నిల్వలు పెరగడంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నుంచి ఆయన ఆరు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1950లో ఆయన కమ్యూనిస్టు పార్టీలో చేరారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. బుర్రకథ బృందంలో ఆయన పనిచేశారు.

Communist leader Narra Raghav Reddy passes away

సిపిఎం శాసనసభా పక్ష నేతగా ఆయన పనిచేశారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు. శాసనసభలో ఆయన ప్రసంగం అత్యంత వినసొంపుగా సాగుతూ ఉండేది. ఆయన ప్రసంగంలో తప్పులు ఎత్తి చూపడం అధికార పక్షానికి కూడా కష్టంగా ఉండేది. శాసనసభలో ఆయన అన్ని పార్టీల మన్ననలు పొందారు.

నర్రా రాఘవ రెడ్డి భౌతిక కాయానికి రేపు శుక్రవారం ఆయన స్వగ్రామం చిట్యాల మండలంలోని వట్టిమర్తిలో జరుగుతాయి. ఆయన మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సంతాపం ప్రకటించారు. రాఘవరెడ్డి జీవితం అందరికీ ఆదర్శప్రాయమని ఆయన అన్నారు. విప్లవ, సామాజిక ఉద్యమాల్లో రాఘవరెడ్డి కీలక పాత్ర పోషించారని ఆయన అన్నారు. రాఘవరెడ్డి మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు. నర్రా రాఘవ రెడ్డి మృతికి సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా సంతాపం ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+