అనూహ్యం: చంద్రబాబుతో పొత్తు ఖరారు -కమ్యూనిస్టులు నాస్తికులు కాదు -సీపీఐ నారాయణ కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్నటిదాకా చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన కమ్యూనిస్టులు.. మళ్లీ సైకిల్‌పై సవారీకి సిద్ధమయ్యారు. ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగి దెబ్బయిపోయిన టీడీపీకి ఇప్పుడు సీపీఐ స్నేహహస్తం అందించింది. టీడీపీతో పొత్తు విషయాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అధికారికంగా ప్రకటించారు. అదే సమయంలో స్వరూపానందతో భేటీపైనా ఆయన వివరణ ఇచ్చుకున్నారు.

శాశ్వత శత్రువులు ఉండరు..
చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం చారిత్రక తప్పిదమని గతంలో తిట్టిపోసిన సీపీఐ నారాయణ మళ్లీ యూటర్న్ తీసుకున్నారు. ప్రస్తుతం జరుగుతోన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీతో స్నేహపూర్వక పొత్తుతో వెళ్తున్నామని స్పష్టం చేశారు. నిజానికి విజయవాడ, గుంటూరు కార్పొరేషన్ల పరిధిలో సీపీఐ, టీడీపీలు ఉప్పటికే సీట్ల షేరింగ్, ఉమ్మడి ప్రచారంతో ముందుకు వెళుతుండగా, పొత్తు విషయాన్ని ఒక రాష్ట్ర(జాతీయ) స్థాయి నేత ఖరారు చేయడం ఇదే తొలిసారి. స్థానిక ఎన్నికల్లో చంద్రబాబుతో కుదిరిన పొత్తును భవిష్యత్తులోనూ కొనసాగించే అవకాశముందన్నారు నారాయణ. ప్లేటు ఫిరాయించినప్పుడల్లా చెప్పే డైలాగ్ ''రాజకీయాల్లో శాశ్వత శత్రువులు...శాశ్వత మిత్రులు ఉండురు''అని కూడా చెప్పారు.

అరాచకాల జగన్‌కు అంత భయమా?
గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని 8వ వార్డు అభ్యర్థి జంగాల రమాదేవికి మద్దతుగా టీడీపీ నేతలతో కలిసి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక ఎన్నికల్లో ఎన్నికల్లో అధికార వైసీపీ అరాచకాలు అన్నీ ఇన్నీ కావని, ఈ స్థాయిలో నిర్బంధ ఏకగ్రీవాలు గతంలో ఏనాడూ చూడలేదని, అధికార దుర్వినియోగం విచ్చలవిడిగా సాగుతోందని నారాయణ వాపోయారు. సంక్షేమ కార్యక్రమాలు, నవరత్నాలకు ఓట్లు రావని జగన్ భయపడుతున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కును అమ్మేస్తున్నారని, ఢిల్లీలో కేంద్ర పెద్దల పాదపూజలు చేసే విజయసాయిరెడ్డి.. విశాఖకు వచ్చి పాదయాత్రలు చేస్తుండటం హాస్యాస్పదంగా ఉందని సీపీఐ నేత వ్యాఖ్యానించారు.
Recommended Video

కమ్యూనిస్టులు నాస్తికులు కాదు..
శారద పీఠాధిపతి స్వరూపానంద స్వామిని సీపీఐ నారాయణ కలవడం, కాషాయ కండువా కప్పుకుని, దండాలు పెట్టడంపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. దీనిపై నారాయణ తనదైన వివరణ ఇచ్చుకున్నారు. కమ్యూనిస్టులు నాస్తికులు కాదని, దేవుడనే భావనకు వ్యతిరేకం కాదని, కేవలం మెటీరియలిస్టులం మాత్రమే అని నారాయణ స్పష్టం చేశారు. బుధవారం విశాఖలోని శారదా పీఠాన్ని అనుకోకుండా సందర్శించానని, జీవీఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి తరఫున 97వ వార్డులో ఆయన పర్యటిస్తుండగా శారదా పీఠాన్ని చూసి లోపలకు వెళ్లానని, సీపీఐ అభ్యర్థిని గెలుపొందేలా ఆశీర్వదించాలని కోరానని చెప్పుకొచ్చారు.ఒకరి అభిప్రాయాన్ని మరొకరితో పంచుకున్నామని తెలిపారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications