రైలు ప్రయాణికులకు అదిరిపోయే గిఫ్ట్ ప్రకటించిన నరేంద్రమోడీ

ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ మొదటిసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మూడోసారి బాధ్యతలు స్వీకరించేంతవరకు, స్వీకరించిన తర్వాత కూడా ఆయన రైల్వేకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రయాణికులకు అత్యంత తక్కువ ధరలో భద్రతతో కూడిన ప్రయాణ సౌకర్యం కల్పించడమే దీనికి కారణం. భారతీయ రైల్వేను మరింతగా అభివృద్ధి పరిచి అత్యాధునిక సదుపాయాలు, అత్యాధునిక సాంకేతికతను తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఈ కోవలోనే వందేభారత్ రైళ్లను తీసుకురాగా, ఈ ఏడాది చివరకు హైడ్రోజన్ రైళ్లు, వచ్చే ఏడాది బుల్లెట్ రైలును పట్టాలెక్కించబోతున్నారు.

రాయితీల పునరుద్ధరణ
భారతీయ రైల్వే వివిధ కేటగిరిల్లో ప్రయాణించేవారి కోసం అనేక రాయితీలు ప్రకటిస్తుంది. సీనియర్ సిటిజన్లకు, జర్నలిస్టులకు, ప్రజాప్రతినిధులకు, సైనికులకు.. ఇలా వివిధ రంగాల్లోనివారికి టికెట్లలో రాయితీని ఇస్తుంటుంది. కరోనా సమయంలో సీనియర్ సిటిజన్లకు ఇస్తున్న రాయితీని రైల్వేలు ఎత్తేశాయి. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. రైల్వేకు ఆదాయమే ప్రధానంగా మారిందని, ప్రజా సంక్షేమం పట్టడంలేదంటూ విపక్షాలు విరుచుకుపడ్డాయి. తాజాగా ఈ సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం మళ్లీ తీసుకురాబోతోంది. దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత సీనియర్ సిటిజన్ల రాయితీని పునరుద్ధరించబోతోంది.

Concession for senior citizens is going to be restored in Railways

కరోనా తర్వాత సీనియర్ సిటిజన్ల ప్రయాణం పెరిగింది
కరోనా తర్వాత రైళ్లల్లో సీనియర్ సిటిజన్ల ప్రయాణం బాగా పెరిగిందని లోక్ సభలో ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 2021 ఏప్రిల్ 1 నుంచి 2022 ఫిబ్రవరి వరకు దేశవ్యాప్తంగా దాదాపుగా ఐదుకోట్ల మంది సీనియర్ సిటిజన్లు రైళ్లల్లో ప్రయాణించారు. వారికి ఆ సమయంలో రాయితీనిచ్చేందుకు రైల్వే నిరాకరించింది. అయితే ప్రస్తుతం వీరికి రాయితీని వర్తింపచేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఏసీ కోచ్ లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు రాయితీ ఇవ్వకుండా స్లీపర్ క్లాస్ బోగీల్లో ప్రయాణించేవారికి మాత్రమే రాయితీని వర్తింప చేయనున్నారు. జనరల్ టికెట్లపై కూడా రాయితీ ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన రాబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+