భార్యతో బలవంతపు సెక్స్: కేంద్రంపై లోక్‌సత్తా ఆగ్రహం
హైదరాబాద్: భార్యతో బలవంతపు శృంగారాన్ని భారత్‌లో నేరంగా చూడలేమన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటన పైన లోక్‌సత్తా ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం తీరును పార్టీ తీవ్రంగా ఖండించింది. మహిళల కనీస మానవ హక్కులను, రాజ్యాంగం వారికి అందించిన ప్రాథమిక హక్కులను పరిరక్షించే బాధ్యత నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిస్సిగ్గుగా తప్పించుకుంటోందని ధ్వజమెత్తారు.
ప్రభుత్వపరమైన తన బాధ్యతలను నిర్వహించడానికి భారతీయ సంస్కృతి అవరోధంగా మారిందన్నట్లు బూటకపు వాదనను వినిపిస్తోందని లోక్‌సత్తా నేత సురేంద్ర శ్రీవాస్తవ, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్ పర్సన్ తార అన్నారు.
అత్యాచారం లేదా పరస్పర అంగీకారం లేని శృంగారం అంటేనే హింస అన్నారు. భారతీయ సంస్కృతిలో వివాహ వ్యవస్ధ పవిత్రమైనదని, భార్యాభర్తల మధ్య హింస, బలవంతపు శృంగారాన్ని నేరంగా భావించలేమని చెప్పడం హాస్యాస్పదమైన్నారు.

కాగా, ఇష్టం లేకున్నా, ఆమె అంగీకారం లేకుండా బలవంతపెట్టి భార్యను శారీరకంగా కలిస్తే అది భారత సందర్భంలో నేరం కాదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌదరి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. డిఎంకె సభ్యురాలు కనిమొళి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇస్తూ ఆ విషయం స్పష్టం చేశారు.
భర్త బలవంతంగా అనుభవించినా (మారిటల్ రేప్) అది రేప్ కాదనే మినహాయింపు ఐపిసిలోని 375 సెక్షన్‌లో రేప్ నిర్వచనంలో ఉందని చెబుతూ దీన్ని సవరించేందుకు బిల్లు ఏమైనా తెస్తున్నారా అని కనిమొళి అడిగారు. మహిళలపై వివక్షను రూపుమాపేందుకు ఏర్పాటు చేసిన ఐక్యరాజ్యసమితి భారత్ ఈ మేరకు చట్ట సవరణ చేయాలని, మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించాలని సూచించిన విషయం నిజమేనా అని ఆమె అడిగారు.
భార్యకు ఇష్టం లేకపోయినా, ఆమె అంగీకారం లేకుండా బలవంతపెట్టి శారీరకంగా కలిస్తే అది విదేశాల్లో నేరమేనని, అది అత్యాచారం కిందికే వస్తుందని, అయితే, అంతర్జాతీయంగా దీనికి నిర్వచనం వేరని, భారత్‌లోని భిన్నమైన సామాజిక స్థితిగతుల నేపథ్యంలో దీన్ని మన దేశంలో అత్యాచారంగా నిర్వచించలేమని, అలాంటి బిల్లు తెచ్చే ఆలోచన ఏదీ లేదని, భర్తలకు మినహాయింపు ఇస్తున్న 375ని సవరించే యోచన లేదని మంత్రి హరిభాయ్ చౌదరి స్పష్టం చేశారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications