ఏపీకి రేవంత్, కూటమి టార్గెట్ గా - షర్మిలకు పార్టీ రోడ్ మ్యాప్..!!

ఏపీలో అటు ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఫిక్స్ అయింది. అటు కాంగ్రెస్ ఏపీ పైన ఫోకస్ చేసింది. బీజేపీతో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. వైసీపీ సింగిల్ గా బరిలో ఉంది. వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ మరో కూటమిగా అభ్యర్దులను ప్రకటించింది. పార్టీల అధినేతలు హోరా హోరీగా ప్రచారం చేస్తున్నారు. ఈ సమయంలోనే ఏపీలోప్రచారం కోసం కాంగ్రెస్ 40 మందితో స్టార్ క్యాంపెయినర్ల లిస్టు విడుదల చేసింది.

ఏపీలో ఎన్నికల ప్రచారం చేసే కాంగ్రెస్ నేతలను పార్టీ ఖరారు చేసింది. కాంగ్రెస్ నుంచి ఇప్పటి వరకు షర్మిల ప్రధాన ప్రచారం కొనసాగిస్తున్నారు.కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్, ఖర్గే, ప్రియాంక తో సహా 40 మందిని ప్రకటించారు. వీరిలో తెలంగాణ రాష్ట్రం నుంచి 11 మంది ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు ఉన్నారు. వీరితోపాటు మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత అజారుద్దీన్, మరో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కూడా స్టార్ క్యాంపెయినర్లుగా చోటు లభించింది.

Congress announced a list of 40 star campaigners for party candidates in AP Elections

సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న క్రేజు దృష్టిలో ఉంచుకొని ఏపీకి సమయం కేటాయించాలని హైకమాండ్ స్పష్టం చేసినట్టు సమాచారం. మంత్రులు కూడా ఏపీలో ప్రచార బరిలో నిమగ్నం అవుతారు. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఏపీతోపాటు తెలంగాణ ఎన్నికలను సమన్వయం చేసుకొని ముఖ్య నేతలు ప్రచారం చేసే అవకాశం ఉంది. కాంగ్రెస ప్రధాన లక్ష్యం బీజేపీ. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఉన్నాయి. గతంలో విశాఖలో పార్టీ సభకు హాజరైన రేవంత్ అటు జగన్...ఇటు చంద్రబాబును టార్గెట్ చేసారు. షర్మిల సైతం ఇద్దరు నేతలు మోదీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు హోరా హోరీగా మారుతున్న ప్రచారంలో రేవంత్, పార్టీ నేతలు ఏపీలోకి ఎంట్రీ ఇస్తే ఎన్నికల రాజకీయం మరింత ఉత్కంఠగా మారే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+